గుడ్డులోని పచ్చసొన తింటే ఏమవుతుందో తెలుసా..?

ABN , First Publish Date - 2022-03-18T20:06:26+05:30 IST

గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం, జీవనశైలి కూడా ముఖ్యమే. సాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ అధికంగా ఉండే వెన్న, నెయ్యి, కొబ్బరినూనె మానెయ్యడం మంచిది. రెడ్‌మీట్‌కి బదులుగా కొవ్వు

గుడ్డులోని పచ్చసొన తింటే ఏమవుతుందో తెలుసా..?

ఆంధ్రజ్యోతి(18-03-2022)

ప్రశ్న: ‘హార్ట్‌ ఫ్రెండ్లీ’ ఆహారం ఏది? గుండె ఆరోగ్యానికి ఎలాంటి ఆహారపు అలవాట్లు అవసరం?


- మృదుల, రంగారెడ్డి


డాక్టర్ సమాధానం: గుండె ఆరోగ్యానికి మంచి ఆహారం, జీవనశైలి కూడా ముఖ్యమే. సాచ్యురేటెడ్‌ ఫ్యాట్స్‌ అధికంగా ఉండే వెన్న, నెయ్యి, కొబ్బరినూనె మానెయ్యడం మంచిది. రెడ్‌మీట్‌కి బదులుగా కొవ్వు తక్కువగా ఉండే చికెన్‌, చేప లాంటివి మాత్రమే తినాలి. గుడ్డులోని పచ్చసొనలో కొలెస్ట్రాల్‌ ఉన్నప్పటికీ అందులో గుండెకు మేలు చేసే పోషకాలున్నాయి. కాబట్టి వారానికి 4-5 మించకుండా గుడ్లు (పచ్చసొనతో సహా) తీసుకోవచ్చు. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే అన్ని రకాల కాయగూరలు, ఆకుకూరలను రోజుకు కనీసం 300 గ్రాములైనా తీసుకోవాలి. బరువు ఎక్కువున్న వారు కొంత బరువు తగ్గాలి కూడా. అన్ని రకాల పండ్లు తీసుకోవచ్చు. మంచికొవ్వులు ఉండే బాదం, ఆక్రోట్‌, అవిసె గింజల లాంటి వాటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి. వైద్యుల సలహా మేరకు తక్కువ శ్రమతో కూడుకున్న నడక, ఈత లాంటి తేలిక పాటి వ్యాయామాలు కూడా చేయవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం ముఖ్యం. మానసిక ఆందోళనలను తగ్గించుకునేందుకు ఏవైనా వ్యాపకాలు ఎంచుకోవాలి. ధ్యానం కూడా మంచి సాధనమే.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Updated Date - 2022-03-18T20:06:26+05:30 IST