డీప్‌ ఫ్యూజన్‌ టెక్నాలజీ అంటే ?

ABN , First Publish Date - 2020-08-29T05:30:00+05:30 IST

యాపిల్‌ సంస్థ కొంతకాలం క్రితం ప్రవేశపెట్టిన డీప్‌ ఫ్యూజన్‌

డీప్‌ ఫ్యూజన్‌  టెక్నాలజీ అంటే ?

యాపిల్‌ సంస్థ కొంతకాలం క్రితం ప్రవేశపెట్టిన డీప్‌ ఫ్యూజన్‌  టెక్నాలజీ గురించి వివరించగలరు. 

-  కార్తికేయ


యాపిల్‌ ఐఫోన్‌ 11, 11 ప్రో ఫోన్లలో మెరుగైన ఫొటోలు తీయడం కోసం డీప్‌ ఫ్యూజన్‌ అనే టెక్నాలజీని పరిచయం చేశారు. మన ఫోటోలు తీసేటప్పుడు తొమ్మిది వేర్వేరు ఎక్స్‌పోజర్‌ స్థాయిలతో విడివిడిగా ఫొటోలు క్యాప్చర్‌ చేసి వాటన్నిటినీ కలపడం ద్వారా అద్భుతమైన నాణ్యత కలిగిన ఫొటో లభించే విధంగా ఈ టెక్నాలజీ ఉపకరిస్తుంది. ఇది ఎంత వేగంగా పనిచేస్తుంది


అంటే మీరు క్యాప్చర్‌ బటన్‌ ప్రెస్‌ చెయ్యకముందే  ఒక నాలుగు షార్ట్‌ ఫోటోలు, నాలుగు సెకండరీ ఇమేజెస్‌ ఆటోమేటిగ్గా తీస్తాయి. క్యాప్చర్‌ బటన్‌ ప్రెస్‌ చేసిన వెంటనే లాంగ్‌ ఎక్స్పోజర్‌ కలిగిన ఒకే ఒక ఫొటో ఫైనల్‌గా తీయబడుతుంది. ఆ తర్వాత కేవలం ఒకే ఒక సెకన్లో  న్యూరల్‌ ఇంజిన్‌ ఆధారంగా వాటి ఆధారంగా మెరుగైన ఫొటో తయారు అవుతుంది.


Updated Date - 2020-08-29T05:30:00+05:30 IST