‘ఆసరా’ అంటే ఏంటి.. AP Ministerకు ఆ మాత్రం తెలియదా..!?

ABN , First Publish Date - 2022-05-12T16:59:46+05:30 IST

‘ఆసరా’ అంటే ఏంటి.. AP Ministerకు ఆ మాత్రం తెలియదా..!?

‘ఆసరా’ అంటే ఏంటి.. AP Ministerకు ఆ మాత్రం తెలియదా..!?

పల్నాడు జిల్లా/ముప్పాళ్ల : ‘ఆసరా పథకం’ (YSR Asara Scheme) అంటే ఏమిటి అంటూ.. మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) వలంటీర్లను అడిగి తెలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మంత్రికే ప్రభుత్వ పథకాలపై అవగాహన లేకపోవడంతో వలంటీర్లు ఒక్కసారిగా కంగుతిన్నారు. బుధవారం పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడు గ్రామంలో జరిగిన ‘గడపగడపకు...’ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. అంబటి గోళ్లపాడులో ఇంటింటికి తిరిగి సంక్షేమ పథకాలను వివరించారు. ఈ క్రమంలో ఆసరా పథకం అందడం లేదని ఒకరు మంత్రి (Minister) దృష్టికి తెచ్చారు. దీంతో ఆసరా అంటే ఏమిటని అంటూ.. వలంటీర్లను మంత్రి ప్రశ్నించారు. దీంతో వారు మంత్రికి సదరు పథకం గురించి వివరించారు. దీంతో సదరు పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు అందేలా చూడాలని మంత్రి సూచించారు. ఇదిలావుంటే, ప్రభుత్వ పథకాలపై (Schemes) అంబటి పరిజ్ఞానానికి ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

Read more