వాకింగ్‌లో నీరసం పోవాలంటే..

ABN , First Publish Date - 2020-08-06T22:59:03+05:30 IST

నేను ఉదయం కాస్త ఆలస్యంగానే వాకింగ్‌కు వెళతాను. నీరసంతో ఎక్కువసేపు వాకింగ్‌ చేయలే

వాకింగ్‌లో నీరసం పోవాలంటే..

ఆంధ్రజ్యోతి(06-08-2020)

ప్రశ్న: నేను ఉదయం కాస్త ఆలస్యంగానే వాకింగ్‌కు వెళతాను. నీరసంతో ఎక్కువసేపు వాకింగ్‌ చేయలేకపోతున్నాను. వాకింగ్‌కు వెళ్లే ముందు ఏదైనా తినొచ్చా?


- మీనాక్షి, చిత్తూరు 


డాక్టర్ సమాధానం: పరగడుపున వ్యాయామం చేస్తే కొంతమందికి నీరసం వస్తుంది. మీరు వాకింగ్‌కు వెళ్లే ఒక గంట ముందు తేలికపాటి అల్పాహారం తీసుకోవడం, లేదా పావుగంట పది నిముషాల ముందయితే ఏదైనా ఒక పండు లేదా రెండు ఖర్జ్జూరాలు, పది ఎండు ద్రాక్షలు వంటివి తీసుకుంటే మీరు నడుస్తున్న సమయానికి తగిన శక్తి లభిస్తుంది. ఒకొక్కసారి ఎండెక్కాక  నడక మొదలెట్టినప్పుడు ఆ వేడికి చెమటలు ద్వారా శరీరంలోని నీరు, లవణాలు కూడా కోల్పోతాము. ఇలా డీహైడ్రేట్‌ అవడం మూలాన కూడా నీరసం వస్తుంది. ఇది నివారించడానికి, ఎండకు  వాకింగ్‌కు వెళ్తున్నట్టయితే చిన్న బాటిల్లో ఒక అరలీటరు నీళ్లు తీసుకొని వెళ్లడం మంచిది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)


Updated Date - 2020-08-06T22:59:03+05:30 IST