Advertisement
Advertisement
Abn logo
Advertisement

శరీరంలో వేడి తగ్గాలంటే..?

ఆంధ్రజ్యోతి(13-11-2020)

ప్రశ్న: నాకు నలభై ఏళ్లు, వేడి శరీరం నాది. ఎప్పుడూ జ్వరం వచ్చినట్లు వేడిగా అన్పిస్తుంది నా శరీరం. ఆహారంలో ఏ జాగ్రత్తలు పాటిస్తే ఈ వేడి తగ్గుతుంది?


- రాగిణి, విశాఖపట్నం


డాక్టర్ సమాధానం: శరీర ఉష్ణోగ్రత సాధారణంగా 97.7 నుంచి 99.5 డిగ్రీల ఫారన్‌హీట్‌ మధ్యలో ఉంటుంది. ఇంతకంటే ఎక్కువ గానీ తక్కువగానీ ఉంటే ఏదో అనారోగ్యం ఉందని భావించవచ్చు. శరీర ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి మహా దివ్యౌషధం నీళ్లు. మంచినీటిని ఎక్కువగా తాగండి. నీళ్లతో పాటు మజ్జిగ, కొబ్బరి నీళ్లు బాగా తీసు కోండి. అన్నంతో పాటు సాంబారు, రసం తీసుకోవడం మంచిది. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండే పుచ్చ, కర్బూజా, ద్రాక్ష లాంటి పళ్లను తీసుకోవడం వల్ల వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు. అయితే అన్ని కాలాల్లోనూ శరీరం వేడిగా ఉండేట్టయితే వైద్యులను సంప్రదించడం శ్రేయస్కరం.


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com (పాఠకులు తమ సందేహాలను

sund[email protected] కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement