స్పీకర్‌కు సంబంధమేంటి?

ABN , First Publish Date - 2022-01-13T05:27:13+05:30 IST

ధాన్యం కొనుగోలుకూ...శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కూ సంబంధం ఏమిటని శ్రీకాకుళం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కూన రవికుమార్‌ ప్రశ్నించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయక... రైతులు అవస్థలు పడుతున్నారు. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ నియోజకవర్గంలోని దీర్ఘాశి గ్రామంలోనే ధాన్యాన్ని కొనేవారు లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

స్పీకర్‌కు సంబంధమేంటి?
మాట్లాడుతున్న కూన రవికుమార్‌

- చెప్పాల్సింది మంత్రులు.. లేదా అధికారులు

- నిత్యావసరాలను వదిలేసి... సినిమా టిక్కెట్ల ధరల తగ్గింపా?

- టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు కూన రవికుమార్‌

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జనవరి 12: ధాన్యం కొనుగోలుకూ...శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌కూ సంబంధం ఏమిటని శ్రీకాకుళం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కూన రవికుమార్‌ ప్రశ్నించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘జిల్లాలో ధాన్యం కొనుగోలు చేయక... రైతులు అవస్థలు పడుతున్నారు. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ నియోజకవర్గంలోని దీర్ఘాశి గ్రామంలోనే ధాన్యాన్ని కొనేవారు లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కానీ స్పీకర్‌ సీతారాం ఏవేవో  చెబుతున్నారు. అసలు ఆయనకు ఆ అధికారమే లేదు. అది చెప్పాల్సింది మంత్రులు లేదా అధికారులు. జిల్లాలో   పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకుంటే రాష్ట్రమంతా ధాన్యంతో ఊరేగింపు నిర్వహించి కలెక్టరేట్‌ వద్ద పడేస్తాం. దేశంలో కరోనా కష్టకాలంలోనూ అత్యధిక ఆదాయం పొందింది ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే. డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలతో పాటు చెత్తపన్ను కూడా వసూలు చేస్తున్నారు. ఈ డబ్బులు ఏమైపోతున్నాయో చెప్పాలి. సీఎం చేసిన రూ.నాలుగు లక్షల కోట్ల అప్పులు ఏమయ్యాయో చెప్పాలి. రాష్ట్ర ఆదాయం ఉద్యోగుల జీతాలకే సరిపోవట్లేదని సీఎం చెబుతున్నారు. ప్రజల్లో ఉద్యోగవర్గాలపై చులకన భావం కల్పించడానికే ఈ ప్రచారం. వైఎస్‌ఆర్‌ కంటే ఎక్కువగా జగన్మోహన్‌రెడ్డి ఉద్యోగులను మోసం చేశారు. ఇప్పటికైనా ఉద్యోగ సంఘాలు మేల్కొనాలి. వారికి టీడీపీ అండగా ఉంటుంది. సాక్షి పత్రికతో పాటు భారతి సిమెంట్‌ ధరలు మాత్రం పెంచుకున్నారు. సీఎంకు నెలకు రూ.20వేల కోట్లు ముడుపులు అందుతున్నాయి. నిత్యావసరాల ధరలు తగ్గించకుండా కేవలం సినిమా టిక్కెట్ల ధరలను తగ్గించడం ఎంతవరకు సబబు? కమ్యూనిస్టులు గొంతులు సవరించాలి. సచివాలయ ఉద్యోగుల వెనుక తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారని ఆరోపించడం సరికాద’ని రవికుమార్‌ అన్నారు. సమావేశంలో టీడీపీ నగర అధ్యక్షులు వెంకటేష్‌, ఇతర  నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-13T05:27:13+05:30 IST