తగినంత నిద్ర లేనప్పుడు ఏ అనారోగ్య సమస్యలు వస్తాయంటే..

ABN , First Publish Date - 2022-03-07T15:48:36+05:30 IST

ప్రతిరోజూ 6 నుండి 8 గంటల నిద్ర..

తగినంత నిద్ర లేనప్పుడు ఏ అనారోగ్య సమస్యలు వస్తాయంటే..

ప్రతిరోజూ 6 నుండి 8 గంటల నిద్ర.. శారీరకంగా, మానసికంగా ఉపశమనం కలిగిస్తుంది. ఇది శరీర పని సామర్థ్యాన్ని కాపాడుతుంది. అయితే మనిషికి తగినంత నిద్ర లేకపోతే అది శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పలు పరిశోధనలు చేశారు. అసంపూర్ణ నిద్ర శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని ఈ పరిశోధనలో తేలింది. నిద్ర లేకపోవడం వల్ల శరీరం ఏవిధంగా ప్రభావితమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 


నిద్ర లేకపోవడం వల్ల ప్రత్యక్ష ప్రభావం కళ్లపై కనిపిస్తుంది. శరీరంలో ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయి పెరుగుతుంది. చర్మం సున్నితంగా ఉండే ప్రదేశాలలో దీని ప్రభావం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఫలితంగా, కళ్ల కింద చారలు లేదా నల్ల మచ్చలు ఏర్పడతాయి. సైన్స్ ఫోకస్ నివేదిక ప్రకారం ఒక వ్యక్తికి తగినంత నిద్ర లేకపోతే అతని మెదడుపై దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ఈ పరిశోధన జరిగింది. నిద్రలేమి అనేది వ్యక్తిలోని భావోద్వేగాలను ప్రభావితం చేసే మెదడుపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశోధనలో వెల్లడైంది. ఫలితంగా ఆ వ్యక్తి చిరాకుగా ఉంటాడు. నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో ఒత్తిడి హార్మోన్ల స్థాయి పెరుగుతుందని నివేదిక చెబుతోంది. ఇది జరిగినప్పుడు రక్తపోటు పెరుగుతుంది. గ్లూకోజ్ స్థాయి, జీవక్రియ తగ్గుతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది, అందుకే ప్రతిరోజూ 6 నుండి 8 గంటలపాటు నిద్రపోవాలి. అసంపూర్తిగా నిద్రపోవడం వల్ల శరీరంలో అపాటైట్ హార్మోన్ గ్రెలిన్ పెరుగుతుంది. నిద్రలేమితో బాధపడే వ్యక్తి తన ఆకలి కంటే 25 శాతం ఎక్కువ ఆహారం తీసుకుంటాడు. ఫలితంగా ఊబకాయం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. తగినంత నిద్రపోకపోతే టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. 


Updated Date - 2022-03-07T15:48:36+05:30 IST