Eat a Tube of Toothpaste: టూత్‌పేస్ట్ తింటే ఏం జరుగుతుంది?

ABN , First Publish Date - 2022-09-12T21:19:49+05:30 IST

ఆరు సంవత్సరాల కంటే తక్కున వయసున్న పిల్లలు బ్రష్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.

Eat a Tube of Toothpaste: టూత్‌పేస్ట్ తింటే ఏం జరుగుతుంది?

టూత్ పేస్ట్ వాడుతున్నప్పుడు పిల్లలు మింగకుండా చూడాలి. ఎందుకంటే టూత్ పేస్ట్ లోపల ఫోరైడ్ ఉంటుంది. పేస్ట్ పొరపాటున తిన్నా కూడా దాని ఫలితం తీవ్రంగానే ఉంటుందట. పిల్లలు మామూలుగా పేస్ట్ తీయగా ఉంటుందని పెద్దల కళ్లల్లో పడకుండా తినేస్తూ ఉంటారు. ఇది కూడా ఆరు సంవత్సరాల కంటే తక్కున వయసున్న పిల్లలు బ్రష్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా పళ్ళు తోముకోవాలంటే చిన్న సైజు పేస్ట్ సరిపోతుంది. టూత్ పేస్ట్ ముఖ్యంగా ఫ్లోరైడ్ అందించి తెల్లగా చేయడం మాత్రమే.


అయితే, ఫ్లోరైడ్‌ను ఉన్న టూత్‌పేస్ట్‌లను తింటే, సమస్య పెద్దగా ఉంటుంది. ఫ్లోరైడ్ అధిక పరిమాణంలో విషపూరితమై దుష్ప్రభావాలు ఇలా ఉంటాయి. కడుపు నొప్పి, ప్రేగులలో అడ్డుపడటం, మూర్ఛలు, అతిసారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, డ్రూలింగ్, షాక్, వణుకు, బలహీనత, వాంతులు,గుండెపోటు వంటి లక్షణాలు ఉంటాయి.


ఫ్లోరైడ్ లేని మొత్తం టూత్‌పేస్ట్‌ను మింగడం జరిగితే, ఫ్లోరైడ్ లేని పేస్ట్ తిన్నట్లయితే ఆ ప్రభావం కడుపు నొప్పి ఎక్కువై వాంతులు, వికారం కలుగుతాయి. 


ఫ్లోరోసిస్ వ్యాధి.. ఫ్లోరోసిస్ రెండు రకాలుగా వస్తుంది. డెంటల్ ఫ్లోరోసిస్ ఇది పిల్లలను ప్రభావితం చేస్తుంది. ఇది దంతాలను పసుపు రంగులోకి మారుస్తుంది. రెండోది అస్థిపంజర ఫ్లోరోసిస్ ఇది శరీరంలోని కీళ్ళను ప్రభావితం చేస్తుంది. మెడ, వీపు, భుజాలు, మోకాళ్ళు బలహీనంగా మారి నొప్పిగా ఉంటాయి.


పిల్లలుకు దూరంగా పేస్ట్ ఉంచండి...

1. చాలా చిన్న పిల్లలకు తక్కువ ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ వాడండి.

2. నోరు కడుక్కోవడంలో పిల్లలు పేస్ట్ మింగకుండా చూడాలి.

3. పేస్ట్ ను పిల్లలకు అందకుండా ఉంచాలి.

4. పేస్ట్ తిన్న పిల్లలను వెంటనే వైద్యుని దగ్గరకు తీసుకువెళ్ళడం మంచిది.

Updated Date - 2022-09-12T21:19:49+05:30 IST