ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్లిన మహిళ.. పనుందని పక్కకు తీసుకెళ్లిన ఎస్ఐ.. ఆమె బలహీనతను గమనించి..

ABN , First Publish Date - 2021-12-07T21:43:19+05:30 IST

కొందరు పోలీసు అధికారులు మాత్రం.. ఫిర్యాదుదారుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. ప్రత్యక్ష నరకం చూపిస్తూ ఉంటారు. ఇలాంటి వారిని చూసే.. పోలీసులంటేనే చాలామంది భయపడుతూ ఉంటారు. తమిళనాడులో ఓ ఎస్ఐ..

ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వెళ్లిన మహిళ.. పనుందని పక్కకు తీసుకెళ్లిన ఎస్ఐ.. ఆమె బలహీనతను గమనించి..
ప్రతీకాత్మక చిత్రం

సమస్యలు తలెత్తినప్పుడు వెంటనే పోలీసులు గుర్తుకు వస్తారు. వారి వద్దకు వెళ్తే న్యాయం జరుగుతుందని నమ్మకం. ఇందుకు తగ్గట్టుగానే  చాలా మంది పోలీసులు, బాధితులకు న్యాయం చేస్తూ.. వారి డిపార్ట్‌మెంట్ పేరును నిలబెడుతుంటారు. అయితే కొందరు పోలీసు అధికారులు మాత్రం.. ఫిర్యాదుదారుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. ప్రత్యక్ష నరకం చూపిస్తూ ఉంటారు. ఇలాంటి వారిని చూసే.. పోలీసులంటేనే చాలామంది భయపడుతూ ఉంటారు. తమిళనాడులో ఓ ఎస్ఐ నిర్వాకం కూడా ఇలాగే ఉంది. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళకు న్యాయం చేయాల్సింది పోయి.. ఆమె బలహీనతను అవకాశంగా తీసుకున్నాడు. వివరాల్లోకి వెళితే..


తమిళనాడులోని కన్యాకుమారి జిల్లా కళియకోవిలై పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ(32) తన కుమార్తె(9)తో కలిసి ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈమె భర్తతో వివాదాలు తలెత్తడంతో విడాకులు తీసుకుంది. తర్వాత కొన్నేళ్లకు మళ్లీ వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొన్నాళ్లు వారి కాపురం సజావుగానే సాగింది. అయితే రానురాను అతడితో కూడా మనస్పర్థలు తలెత్తాయి. తనను మోసగించడంతో పాటూ రోజూ చిత్రహింసలకు గురి చేస్తుండడంతో ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది. పళుగల్‌ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తన రెండో భర్తపై ఫిర్యాదు చేసింది.

భర్తతో సుఖం దొరకలేదని.. పరాయి మగవారిపై మనసు పడింది.. ఓ రోజు చెత్త ఏరుకునే వ్యక్తి ఇంట్లోకి రాగానే..


ఎస్ఐ సుందర లింగం(40)ను కలిసి తన బాధను వివరించింది. కేసు నమోదు చేసి, సమస్యను పరిష్కరించాల్సిన సుందర లింగం.. ఆమె బలహీనతను అవకాశంగా తీసుకున్నాడు. సమస్య అంతా విని.. తప్పకుండా న్యాయం చేస్తానని నమ్మించాడు. కేసు పేరుతో ఏవేవో కారణాలు చెప్పి.. రోజూ స్టేషన్‌కు తిప్పుకొనేవాడు. అప్పుడప్పుడూ బయటకు కూడా తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో ఆమెకు బాగా దగ్గరయ్యాడు. ఓ రోజు నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి.. అత్యాచారం చేశాడు. తర్వాత ప్రతి రోజూ ఆమెను బయటికి తీసుకెళ్తూ రాసలీలలు సాగించేవాడు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చింది. విషయం ఎస్ఐకి చెప్పడంతో ఆలోచనలో పడ్డాడు.


ఈ క్రమంలో ఓ రోజు ఆమెను పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తీసుకెళ్లి.. మత్తు మందు ఇప్పించి, అబార్షన్ చేయించాడు. తర్వాత విషయం తెలుసుకున్న ఆమె.. ఉన్నతాధికారులను కలిసి ఎస్ఐపై ఫిర్యాదు చేసింది. అయితే ఎన్ని రోజులు తిరిగినా న్యాయం మాత్రం జరగలేదు. దీంతో చివరకు న్యాయ స్థానాన్ని ఆశ్రయించింది. విచారించిన న్యాయస్థానం.. సుందరలింగంతో పాటు మరో 8మందిపై కేసు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-12-07T21:43:19+05:30 IST