Abn logo
Feb 22 2020 @ 01:35AM

ఆ ట్రిప్‌లో ఏం జరిగింది.?

మహి, సోనా పాటిల్‌ జంటగా రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘విన్నర్స్‌ ట్రిప్‌’.  శ్రీను తెలుగు దర్శకత్వంలో సంపత్‌ శ్రీను, కె.లక్ష్మణరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాతల్లో ఒకరైన సంపత్‌ శ్రీను మాట్లాడుతూ ‘ గోవాలో సినిమా మొత్తం తీశాం. 30 రోజుల్లో టాకీ, పది రోజుల్లో పాటలు చిత్రీకరించాం. ఇది చిన్న సినిమా అయినా పెద్ద రేంజ్‌లో రావడానికి ప్రతి ఒక్కరూ సహకరించారు’ అన్నారు. 


‘ఒక ఎఫ్‌.ఎం. రేడియో కాంటెస్ట్‌లో గెలిచిన విజేలందరినీ ఓ ట్రిప్‌కు తీసుకెళ్తే , అక్కడ వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి,, వాటిల్లోంచి ఎంత మంది బయటపడ్డారు అన్నది ఈ చిత్రకథాంశం.’ అని  చెప్పారు దర్శకుడు  తెలుగు శ్రీను. 

Advertisement
Advertisement
Advertisement