Oct 28 2021 @ 19:46PM

హీరోయిన్ Nimrat Kaur కు ఏమైంది..? ఎయిర్‌పోర్ట్‌లో ఇలా కనిపించేసరికి ఫ్యాన్స్‌లో ఆందోళన..!

లంచ్ బాక్స్, ఎయిర్ లిఫ్ట్ వంటి చిత్రాల్లో నటించి విమర్శకుల ప్రశంసలు పొందిన నటి నిమ్రత్ కౌర్.  ఎవరూ ఊహించని విధంగా ఆమె ముంబై ఎయిర్ పోర్టులో కనిపించింది. వాకింగ్ స్టిక్ పట్టుకుని నడుస్తూ ప్రయాణికులకు ఆమె దర్శనమిచ్చింది.


ఆమె కాలికి గాయమైనట్టు తెలుస్తోంది. వాకింగ్ స్టిక్ సహాయంతో ఆమె నడుస్తోంది. కాలికి ఏలా గాయమైందని కొందరు ఆమెను ప్రశ్నించారు. వ్యాయామం చేస్తుండగా కాలికి దెబ్బ తగిలిందని ఆమె సమాధానమిచ్చింది. ఆమె మీడియాతో మాట్లాడుతూ..‘‘ నా కాలికి తగిలిన గాయానికి నేను చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం చేస్తున్న పనులను అన్నింటిని ఆపేశాను. నా బాడీ పూర్తిగా కోలుకోవాలంటే  తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. నాకు వేరే చాయిస్ లేదు ’’ అని నిమ్రత్ కౌర్ చెప్పింది.


ఎయిర్ లిఫ్ట్ సినిమా అనంతరం నిమ్రత్ కౌర్ వెండితెరపై కనిపించలేదు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సరసన ఆమె నటించింది. ఈ చిత్రం 2016లో విడుదలైంది. ఏఎల్‌టీ బాలాజీ సంస్థ నిర్మించిన ద టెస్ట్ కేస్‌లో‌ను ఆమె కనిపించింది. ప్రస్తుతం ఆమె దస్వీ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీలో అభిషేక్ బచ్చన్ సరసన ఆమె కనిపించనుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. తన పార్ట్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఆమె ఆగస్టులోనే పూర్తి చేసింది.


Bollywoodమరిన్ని...