పిల్లల్లో ADHD ఉంటే ఏ ఆహారం తీసుకోవాలి..

ABN , First Publish Date - 2022-07-12T20:55:19+05:30 IST

ADHD వ్యాధి చిన్నతనంలోనే పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

పిల్లల్లో ADHD ఉంటే ఏ ఆహారం తీసుకోవాలి..

అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివిటీ డిజార్డర్ (ADHD) ఇది మెదడుకు సంబంధించిన వ్యాధి. పేరులో గజిబిజితనం ఉన్నట్టే ఈ వ్యాధి ప్రభావం పిల్లల మెదడు మీద కాస్త ఎక్కువగానే ఉంటుంది. పిల్లలకు దగ్గరగా మసలే తల్లిదండ్రులు వారిలో ఈ లోపాన్ని ఇట్టే గమనించగలుగుతారు. ADHD వ్యాధి చిన్నతనంలోనే పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అదే పెద్దయ్యాకా కనిపించే అవకాశాలు కూడా లేకపోలేదు. చిన్నతనంలో గుర్తించని వ్యాధిని పెద్దయ్యాకా గుర్తించినట్లయితే వారిలో వ్యాధి లక్షణాలను పసిగట్టి, పరిష్కరించడం కాస్త కష్టంతో కూడుకున్నదే అంటున్నారు వైద్యులు. ఈ వ్యాధి ఉన్నవారిని మిగతావారితో పోల్చినపుడు ఇతర పిల్లల కంటే కాస్త చురుగ్గా కనిపిస్తారు. 

వీరిలో మిగతా లక్షణాలు ఏలా ఉంటాయంటే..

 ఎక్కువ సేపు కూర్చోలేకపోవడం, ఒకే చోట కూర్చున్నా.,కదులుతూ ఉండటం.

 పరధ్యానంలో ఉండటం.

 ఎదుటివారు మాట్లాడేటప్పుడు వినకపోవడం.

 చెప్పిన పని చేయడానికి కష్టపడటం.

 పనులు చేయడంలో ఇబ్బంది పడటం.

 జరిగిన ఘటనలను సులభంగా మరిచిపోవడం.

 గందరగోళానికి గురికావడం.

 అసహనం, చిరాకుగా ఉండటం.

ఈ వ్యాధి ఉన్న పిల్లల్లో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. మనం తినే ఆహారం మన మానసిక స్థితిపై గొప్ప ప్రభావాన్ని చూపుతుంది. 

పిల్లల్లో ADHD ఉన్నట్లయితే వారు తినాల్సిన 10 ఆహార పదార్థాల గురించి తెలుసుకుందాం:


క్రూసిఫరస్ కూరగాయలు అలవాటు చేయండి.

పిల్లల రోజువారీ దినచర్యలో ఐరన్ ఎక్కువగా తీసుకోవడం ADHD లక్షణాలను నియంత్రించడంలో సహాయపడుతుంది. దీనికి ప్రధానంగా బ్రోకలీ, క్యాబేజీ, పాలకూర, కాలీఫ్లవర్, కాలే మొదలైనవి గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అని పిలువబడే క్రూసిఫెరస్ కూరగాయలను రోజువారి ఆహారంలో అలవాటు చేయడం వల్ల వారికి సరిపడినంత ఐరన్ అందేట్టు చేయవచ్చు.

డార్క్ చాక్లెట్ తింటున్నారా.

ADHD ఉన్న పిల్లలు జింక్, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తినమని డాక్టర్స్  సలహా ఇస్తారు. డార్క్ చాక్లెట్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, మెగ్నీషియం, రాగి, మాంగనీస్, పొటాషియం, భాస్వరం, జింక్, సెలీనియం వంటి పోషకాలు ఉంటాయి. ఇవి ADHD లక్షణాలను మెరుగుపరచడంలో ఈ ఖనిజాలు అవసరపడతాయి.

అరటిపండ్లు

అరటిపండ్లు జింక్, మెగ్నీషియం మరొక గొప్ప మూలం. అవి కూడా ఈవెనింగ్ స్నాక్‌గా ఉపయోగపడతాయి. జింక్ డోపమైన్  వివిధ న్యూరోట్రాన్స్మిటర్లను నియంత్రిస్తుందని నిరూపించబడింది. 

కాయధాన్యాలు ఇవ్వండి.

కాయధాన్యాలు శాఖాహారులు, మొక్కల ఆధారిత ఆహారం తీసుకునే వారికి ప్రోటీన్ యొక్క గొప్ప మూలం. ప్రోటీన్ తీసుకోవడం దృష్టి , ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాయధాన్యాలు కూడా వివిధ మార్గాల్లో వండి వడ్డించవచ్చు. ఒకే తరహాలో కాకుండా ప్రతిసారీ కొత్త తరహాలో వండి వీటిని పెట్టడం వల్ల పిల్లలు తినడానికి బోర్ ఫీల్ అవరు. 

గింజలు ఇవ్వండి.

గింజల్లో అనేక పోషకాలు ఉన్నాయి., ముఖ్యంగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల కలిగి ఉంటాయి.  మాంసాహారం తినని పిల్లలకు ఇవి మంచి ఆహారంగా ఉపయోగపడతాయి. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ADHDని కంట్రోల్ చేస్తాయని వైద్యుల సలహా.

విత్తనాలూ మంచిదే..

విత్తనాలు ప్రోటీన్లకు నిలయం.  వీటిలో జింక్, మెగ్నీషియం ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవి మెరుగైన దృష్టి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రతతో పాటు మనస్సును ఉత్తేజపరిచేందుకు సహాయపడతాయి. వీటిని సలాడ్‌లు, స్మూతీలు, జ్యూస్‌లు, కూరలు, శాండ్‌విచ్‌లు అనేక ఇతర వంటకాల్లో చేర్చవచ్చు.

 పన్నీర్ ని పసందుగా చేయండి..

ADHD మందుల యొక్క మెరుగైన సామర్థ్యం కోసం అధిక ప్రోటీన్ ఆహారం తీసుకోవడం చాలా అవసరం. ఆహారంలో ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవడం వల్ల బోరింగ్‌గా ఉంటుంది.  ఆహారంలో పన్నీర్ ను చేర్చడం వలన మీ పిల్లల భోజనంలో కొత్త వెరైటీలను చేసి పెట్టచ్చు.

అవోకాడోస్ ఫూట్..

అవోకాడోస్ ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలు కలిగి ఉంటాయి.  అనారోగ్యకరమైన, చక్కెరతో కూడిన కొవ్వు పదార్ధాల మాదిరిగా కాకుండా, ఇవి శరీరం మెరుగుదలకు చాలా అవసరం. అవోకాడోస్  ఇతర ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహారం కావడం వల్ల శరీరం పోషకాలను గ్రహించడంలో సహాయపడతాయి.

ఆలివ్ నూనె..

రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో ఆలివ్ నూనె సహకరిస్తుంది. ఆలివ్ నూనెలో తక్కువ మోతాదులో ఫైబర్, చక్కెర కేలరీలు పిండిపదార్థాలు ఉన్నాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌కు ఆలివ్ ఆయిల్ మరొక గొప్ప మూలం. ఇతర వంట నూనెలకు చాలా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం.

మంసాహారం తీసుకోండి.

మాంసాహారంలో  అధిక-ప్రోటీన్ కలిగి ఉంటుంది. ఇది మీ పిల్లల ఆహారంలో గొప్ప అదనపు శక్తిగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే అవి ప్రోటీన్ ని పెంచుతాయి. దానివల్ల ఏకాగ్రత మెరుగుపడటంతో పాటు, ఈ ఆహారం తీసుకోవడం వల్ల మందుల సామర్థ్యం కూడా పెరుగుతుంది.

ఈ వ్యాధికి గురైన పిల్లల ఆహార అలవాట్లతో పాటు రోజువారి దినచర్యలో మార్పులు చేయడం కూడా అవసరం. అవసరాన్ని బట్టి చికిత్సను అందించడం. వాడే మందులను క్రమం తప్పకుండా అందివ్వడం వంటివి తప్పక చేయాలి. 


Updated Date - 2022-07-12T20:55:19+05:30 IST