ప్రతీకాత్మక చిత్రం
ప్రస్తుతం అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయి. నిముషానికి ఓ ప్రాంతంలో ఏదో ఒక దారుణం జరగడాన్ని రోజూ చూస్తూనే ఉన్నాం. మహిళలు ఒంటరిగా కనిపిస్తే చాలు.. అత్యాచారం చేయడమో, హత్య చేయడమో చేస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఓ వైద్యురాలికి ఇదే అనుభవం ఎదురైంది. తన స్నేహితుడితో కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లింది. అర్ధరాత్రి ఇంటికి వెళ్లే క్రమంలో ఇద్దరూ కలిసి ఓ ఆటో ఎక్కారు. కొంత దూరం వెళ్లాక.. ఆటో డ్రైవర్, మరికొంత మందితో కలిసి చేసిన పని.. అందరినీ షాక్‌కు గురి చేసింది.
తమిళనాడు రాష్ట్రం వేలూరు పరిధిలోని ఓ ఆస్పత్రిలో వేరే రాష్ట్రానికి చెందిన ఓ మహిళ.. వైద్యురాలిగా పని చేస్తోంది. ఈ క్రమంలో ఈనెల 19న ఆమె తన స్నేహితుడితో కలిసి సెకండ్ షో సినిమాకు వెళ్లింది. సినిమా అయిపోయాక అర్ధరాత్రి సమయంలో ఇంటికి బయలుదేరారు. బస్సులు రాకపోవడంతో ఇద్దరూ కలిసి ఓ ఆటో ఎక్కారు. అప్పటికే ఆటోలో డ్రైవర్‌తో పాటూ మరో ముగ్గురు వ్యక్తులు ఫుల్‌గా మందు తాగి ఉన్నారు. ఆటో కొంతదూరం వెళ్లగానే ఒక్కసారిగా మహిళ స్నేహితుడిపై దాడి చేశారు. అతన్ని కిందకు తోసేసి, మహిళను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ వారంతా ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆమె వద్ద ఉన్న ఏటీఎం కార్డు తీసుకుని, ఆమెను ఓ చోట దింపేసి వెళ్లిపోయారు. ఈ విషయం బయట తెలిస్తే.. తన పరువు పోతుందని, తన తల్లిదండ్రులకు తెలిస్తే ఆత్మహత్య చేసుకుంటారనే ఉద్దేశంతో వైద్యురాలు ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది.
అయితే ఆటో డ్రైవర్, అతడి స్నేహితులంతా కలిసి మహిళ అకౌంట్లో ఉన్న రూ.40,000లను తీసుకున్నారు. అయితే ఆ డబ్బు పంచుకునే క్రమంలో గొడవపడుతూ ఉన్నారు. అదే సమయంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు వీరిని గమనించారు. అదుపులోకి తీసుకుని విచారించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పారు. దీంతో వారిని స్టేషన్‌కు తరలించి.. వారి స్టైల్లో విచారించగా అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు వైద్యురాలిని సంప్రదించగా.. ఫిర్యాదు చేసేందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఈ కేసును ఎలా డీల్ చేయాలో తెలీక పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ వార్త స్థానికంగా సంచలనం కలిగించింది.
ఇవి కూడా చదవండి