Viral Video: వామ్మో ఈ ఎద్దు ఎంత పని చేసింది.. యువకుడిపై ఇలా దాడి చేసిందేంటి.. చివరకు ఏమైందంటే..

ABN , First Publish Date - 2022-03-04T01:00:06+05:30 IST

మనుషుల మీద జంతువులు దాడి చేసే ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా చూశాం. వాటిలో కొన్ని చాలా ప్రమాదకరంగా ఉంటాయి. జంతువుల దాడి నుంచి కొందరు..

Viral Video: వామ్మో ఈ ఎద్దు ఎంత పని చేసింది.. యువకుడిపై ఇలా దాడి చేసిందేంటి.. చివరకు ఏమైందంటే..

మనుషుల మీద జంతువులు దాడి చేసే ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చాలా చూశాం. వాటిలో కొన్ని చాలా ప్రమాదకరంగా ఉంటాయి. జంతువుల దాడి నుంచి కొందరు అదృష్టవశాత్తు తప్పించుకుంటూ ఉంటారు. కొందరు మాత్రం గాయాలతో చావు తప్పి.. కన్ను లొట్టబోయిన చందంగా చివరకు ప్రాణాలతో బయటపడుతూ ఉంటారు. ఇలాంటి వీడియోలు ఇటీవల నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు మనం చూడబోయే వీడియో కూడా ఇలాంటిదే. ఓ వ్యక్తి తన కొడుకుతో కలిసి బుల్ ఫైట్‌లో పాల్గొంటాడు. ఈ క్రమంలో ఆ ఎద్దు యువకుడిని గాల్లోకి ఎగరేసి కింద పడేస్తుంది. చివరకు ఏమైందో తెలుసుకుందాం..


అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం రోడియో అనే ప్రాంతంలో ప్రస్తుతం బుల్ ఫైట్ పోటీలు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాలకు చెందిన అనేక మంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. హుక్స్ తన 18 ఏళ్ల కుమారుడితో కలిసి పోటీల్లో పాల్గొన్నాడు. ముందుకు కొడుకు కౌబాయ్ డ్రస్‌లో ఎద్దుపై కూర్చుని ఉంటాడు. గ్రౌండ్‌లోకి ఎద్దుని వదలగానే ఒక్కసారిగా వేగంగా వెళ్తుంది. ఆ కుదుపులకు యువకుడు కిందపడిపోతాడు. ఎద్దు పైనుంచి సడన్‌గా కింద పడడంతో పైకి లేవలేక అలాగే పడుకుని ఉంటాడు. ఈ క్రమంలో కుమారుడిని కాపాడుకునేందుకు తండ్రి హుక్స్‌తో పాటూ మరో ఇద్దరు అక్కడకు వచ్చి ఎద్దును పక్కకు వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తారు. అయితే ఆ ఎద్దు అనూహ్యంగా మళ్లీ తిరిగొచ్చి కిందపడ్డ యువకుడిని కొమ్ములతో పొడుస్తుంది. అయితే అప్రమత్తమైన యువకుడి తండ్రి.. కొడుకు ప్రాణాలు కాపాడేందుకు అతడిపై పడుకుంటాడు. ఇద్దరినీ కొమ్ములతో పొడిచిన ఎద్దు.. తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఇధ్దరూ స్వల్ప గాయాలతో బయటపడడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

పెళ్లికాని కుర్రాళ్లే వీళ్ల టార్గెట్.. 11 రాష్ట్రాల్లో 1400 మంది బాధితులు.. ఫోన్ చేసి ఏం మాట్లాడతారంటే..!





Updated Date - 2022-03-04T01:00:06+05:30 IST