Expert shares effective tips for healthy hair : పొడవైన, ఆరోగ్యకరమైన జుట్టు గురించి నిపుణులు ఏం చెపుతున్నారంటే...

ABN , First Publish Date - 2022-09-07T15:55:32+05:30 IST

ఆరోగ్యకరమైన జుట్టు కోసం మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి. జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?

Expert shares effective tips for healthy hair : పొడవైన, ఆరోగ్యకరమైన జుట్టు గురించి నిపుణులు ఏం చెపుతున్నారంటే...

ఆరోగ్యకరమైన మెరిసే జుట్టు కావాలని జుట్టును ఆరోగ్యంగా ఉంచాలని ఆడవారంతా తాపత్రయపడతారు. మరి ఆరోగ్యకరమైన జుట్టు కోసం మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి. జుట్టును ఆరోగ్యంగా కాపాడుకోవాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? 


పొడవాటి, మెరిసే జుట్టు అందరం కావాలని కోరుకుంటాం. దానికోసం ఇంట్లో తయారు చేసిన హెయిర్ ఆయిల్, హెయిర్ మాస్క్, కండీషనర్ మొదలైనవి జుట్టు బలంగా, మెరిసేలా ఉండటానికి సహకరిస్తాయి. వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా జుట్టుకు అవసరం. జుట్టు కుదుళ్లలో కెరాటిన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది వెంట్రుకలను బలంగా ఉంచుతుంది.


జుట్టు పొడవుగా, దృఢంగా ఉండాలంటే.. ఖనిజాలు, విటమిన్లు అందించాలి.  దీనికోసం రకరకాల ఉత్పత్తులను, ప్యాక్ లను వాడేస్తూ ఉంటాం. కానీ కాస్మెటిక్ ఉత్పత్తులను ఎక్కువగా వాడినా ఒక్కోసారి జుట్టును కాపాడుకోలేకపోతాం. దీనికి మన ఆరోగ్య సమస్యలు కూడా చాలావరకూ కారణం. జుట్టు పోషణకు సమతుల ఆహారం తీసుకోవడం ఎంతైనా అవసరం. మనం తీసుకునే ఆహారంలో జుట్టు పోషణకు సంబంధించిన పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. 


ఆహారంలో బాదం.. జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు ఆహారంలో బాదం, వాల్ నట్ లు, గుడ్లు తీసుకోవడం మేలు చేస్తుంది. 


ఆకు కూరలు.. పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జుట్టుకు అవసరమైన ఖనిజాలను అందిస్తుంది. శరీరంలో ఐరన్ లేకపోవడం వల్ల జుట్టు రాలిపోతుంది. శరీరంలో ఐరన్ లోపిస్తే.. జుట్టు పెరుగుదలను ఆపివేస్తుంది.


జుట్టు పలచగా ఉన్నవారు ఏ ఆహారం తీసుకోవాలి.. జుట్టు పలుచగా ఉన్నవారు ఉసిరి, కరివేపాకు, మెంతి గింజలను ఆహారంలో తీసుకోవచ్చు. ఇవి జుట్టు పెరుగుదలకు సహకరిస్తాయి. 


సి విటమిన్ కలిగిన పండ్లు.. నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఐరన్ శోషణకు మీ శరీరానికి విటమిన్ సి అవసరం.


జుట్టు పలుచగా రంగుమారితే.. జుట్టు పలుచగా ఉండి వెంట్రుకలు రంగుమారితే విటమిన్ B12, Bవిటమిన్లు తీసుకోవాలి. ఇవి అశ్వగంధలో ఎక్కువగా లభిస్తాయి. ఇవన్నీ వెంట్రుకలు బలంగా, దృఢంగా ఉండేలా చూస్తాయి. 

Updated Date - 2022-09-07T15:55:32+05:30 IST