కొవిడ్ రోగి క్వారంటైన్ కేంద్రానికి ఏం తీసుకువెళ్లాలంటే...

ABN , First Publish Date - 2020-06-15T15:09:33+05:30 IST

కొవిడ్-19 సోకితే రోగి క్వారంటైన్ కేంద్రానికి వెంట తీసుకువెళ్లాల్సిన వస్తువుల గురించి కరోనా నుంచి కోలుకున్న ఓ బాధితురాలు తాజాగా వెల్లడించారు....

కొవిడ్ రోగి క్వారంటైన్ కేంద్రానికి ఏం తీసుకువెళ్లాలంటే...

న్యూఢిల్లీ : కొవిడ్-19 సోకితే రోగి క్వారంటైన్ కేంద్రానికి వెంట తీసుకువెళ్లాల్సిన వస్తువుల గురించి కరోనా నుంచి కోలుకున్న ఓ బాధితురాలు తాజాగా వెల్లడించారు. కరోనా వైరస్ తో నోయిడాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరి దాన్నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయిన ఓ బాధితురాలు కరోనా సోకితే భయందోళనలకు గురి కావద్దని సూచించారు. కరోనా రోగి క్వారంటైన్ కేంద్రానికి వెళ్లేముందు మొబైల్ ఫోన్,  ఛార్జర్, పవర్ బ్యాంక్ ను వెంట తీసుకువెళ్లాలని సూచించారు. ఆసుపత్రి క్వారంటైన్ కేంద్రంలో వేడినీళ్లు తాగేందుకు పోస్తుంటారని, దీనికోసం ప్లాస్టిక్ కాకుండా స్టీలు బాటిల్, ఓ గ్లాసు తీసుకుపోవాలని కోరారు. ఆసుపత్రిలో అల్పాహారం, భోజనం, డిన్నర్ అందిస్తారని, కాని మధ్యలో ఆకలివేస్తే తినేందుకు పండ్లు, అందులోనూ కరోనా నుంచి త్వరగా రికవరీ అయ్యేందుకు వీలుగా విటమిన్ సి ఉన్న సిట్రస్ పండ్లు తీసుకుపోవాలని సలహా ఇచ్చారు. అర్దరాత్రి ఆకలివేస్తే తినేందుకు డ్రై ఫ్రూట్లను వెంట తీసుకువెళ్లాలని కోరారు. మరుగుదొడ్లలో పరిశుభ్రత కోసం సొంత టవల్, సబ్బు, షాంపూ, టూత్ బ్రష్, పేస్ట్ వెంట తీసుకువెళ్లాలని సూచించారు. రోగి పరిస్థితి విషమంగా లేకుంటే మన సొంత దుస్తులు ధరించవచ్చని, అందుకే తగిన దుస్తులు వెంట తీసుకువెళ్లాలి.  మీరు వాడే వ్యక్తిగత మందులను వెంట తీసుకువెళ్లాలి అని కోరారు. రోగి 14రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాలి కాబట్టి చదివేందుకు పుస్తకాలు, డ్రాయింగ్ మెటీరియల్, యాక్టివిటీ బుక్ తీసుకువెళ్లడం మంచిది. ప్రార్థన చేసేందుకు కావాల్సిన వస్తువులను వెంట తీసుకురావడం మంచిదని కరోనా నుంచి కోలుకున్న ఓ బాధితురాలు సలహా ఇచ్చారు. 

Updated Date - 2020-06-15T15:09:33+05:30 IST