టర్న్‌కీ సంస్థ సబ్ లీజ్‌ తీసుకుంటే ప్రభుత్వానికేం సంబంధం?: గనులశాఖ డైరెక్టర్

ABN , First Publish Date - 2022-05-15T00:40:33+05:30 IST

టర్న్‌కీ సంస్థ సబ్ లీజ్‌ తీసుకుంటే ప్రభుత్వానికేం సంబంధం?: గనులశాఖ డైరెక్టర్

టర్న్‌కీ సంస్థ సబ్ లీజ్‌ తీసుకుంటే ప్రభుత్వానికేం సంబంధం?: గనులశాఖ డైరెక్టర్

హైదరాబాద్: ఇసుక మైనింగ్‌ను ఏపీ ప్రభుత్వం జేపీ వెంచర్స్‌కు ఇచ్చిందని గనులశాఖ డైరెక్టర్ తెలిపారు. జేపీ వెంచర్స్ ఎవరికైనా సబ్ లీజ్‌కు ఇవ్వవచ్చని గనులశాఖ డైరెక్టర్ పేర్కొన్నారు. టర్న్‌కీ సంస్థ సబ్ లీజ్‌ తీసుకుంటే ప్రభుత్వానికేం సంబంధం? అని గనులశాఖ తెలిపింది. అధికారికంగా జేపీ వెంచర్స్‌తోనే ఏపీఎండీసీ లావాదేవీలు జరుగుతాయని గనులశాఖ డైరెక్టర్ స్పష్టం చేశారు. ఇప్పటివరకు కోటీ 70 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలు జరిగినట్లు గనులశాఖ వెల్లడించింది. ప్రభుత్వానికి జేపీ వెంచర్స్ రూ.668 కోట్లు చెల్లించిందని, ఇసుక తవ్వకాల్లో ఎక్కడా అక్రమాలు లేవని గనులశాఖ డైరెక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. గనులశాఖ, ఎస్ఈబీ, పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తుందని, అక్రమాలపై ప్రజల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని గనులశాఖ డైరెక్టర్ చెప్పారు.

Read more