లక్షల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా.. రోడ్డు పక్కన వారు పెట్టిన వ్యాపారంతో చివరకు..

ABN , First Publish Date - 2022-03-10T02:53:32+05:30 IST

కొందరికి లక్షల జీతం వస్తున్నా అసంతృప్తితో పని చేస్తుంటారు. మనసులో నిత్యం ఏదో నిరాశతో బతుకు నెట్టుకొస్తుంటారు. ఏదో చేయాలి, ఏదో సాధించాలి అనుకుంటారే గానీ.. అనుకున్న దాన్ని..

లక్షల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా.. రోడ్డు పక్కన వారు పెట్టిన వ్యాపారంతో చివరకు..

కొందరికి లక్షల జీతం వస్తున్నా అసంతృప్తితో పని చేస్తుంటారు. మనసులో నిత్యం ఏదో నిరాశతో బతుకు నెట్టుకొస్తుంటారు. ఏదో చేయాలి, ఏదో సాధించాలి అనుకుంటారే గానీ.. అనుకున్న దాన్ని మాత్రం ఆచరణలో పెట్టలేరు. జీవిత చరమాంకం వరకూ ఇదే అసంతృప్తితో జీవనం సాగిస్తారు. మరికొందరు మాత్రం అనుకున్నది సాధించేందుకు తెగిస్తుంటారు. చివరకు తాము అనకున్నది సాధించి.. సంతృప్తితో జీవనం సాగిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువకులు కూడా తాము అనుకున్నది సాధించేందుకు లక్షల జీతం వచ్చే సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. చివరకు రోడ్డు పక్కన వారు పెట్టిన వ్యాపారంతో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు.


హర్యానాలోని సోనిపట్‌కు చెందిన రోహిత్, సచిన్ అనే ఇద్దరు యువకులు ఇంజినీరింగ్ పూర్తి చేశారు. అనంతరం సాఫ్ట్‌వేర్ జాబ్‌లో స్థిరపడ్డారు. ప్రస్తుతం లక్షల జీతం వస్తుండడంతో ఎలాంటి ఆర్థిక సమస్యలూ లేవు. అయితే వారికి మాత్రం మనుసులో ఏదో అసంతృప్తి ఉండేది. ఉదయం నుంచి సాయంత్రం వరకు యంత్రాల్లా పని చేయడం వారికి అసలు నచ్చేది కాదు. అయినా అయిష్టంగానే చేస్తుండేవారు. అయితే ఇటీవల ఓ రోజు ఎలాగైనా ఉద్యోగానికి రాజీనామా చేసి, వ్యాపారం మొదలెట్టాలని బలంగా నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఉన్నట్టుండి ఉద్యోగానికి రాజీనామా చేశారు. దీంతో తమ స్నేహితులు, సన్నిహితులు వారిని మందలించారు. ‘‘లక్షల జీతం వచ్చే జీతం వదులుకుని.. వ్యాపారం పెట్టుకుంటారా’’.. అంటూ హేళన చేశారు. అయినా వారిద్దరూ ఇవేమీ పట్టించుకోకుండా తమ ఆలోచనను ఆచరణలో పెట్టడం ప్రారంభించారు.

బస్సు రన్నింగ్‌లో ఉండగా.. సడన్‌గా స్పృహ తప్పిన డ్రైవర్.. అంతా భయాందోళనలో ఉండగా ఓ మహిళ పైకి లేచి..


సోనిపట్‌ పరిధిలోని ఓ ప్రాంతంలో రోడ్డు పక్కన వెజ్ బిర్యానీ పేరుతో ఒక స్టాల్‌ను ఏర్పాటు చేశారు. అందరిలా కాకుండా వినూత్నంగా చేయాలనే ఉద్దేశంతో నూనె రహిత బిర్యానీని తయారు చేయడం మొదలెట్టారు. ఆఫ్, ఫుల్  ప్లేట్ వరుసగా రూ.50, రూ.70తో విక్రయించడం మొదలెట్టారు. నాణ్యత, రుచిలో రాజీ పడకుండా చేస్తుండడంతో వ్యాపారం దినదినాభివృద్ధి చెందింది. ఉద్యోగం చేస్తున్నప్పుడు వచ్చే జీతం కంటే ప్రస్తుతం ఇంకా ఎక్కువ సంపాదిస్తున్నామని సంతోషంగా చెబుతున్నారు. సోనిపట్‌లోనే కాకుండా జన సంచారం ఉన్న వివిధ ప్రాంతాల్లో తమ స్టాళ్లను విస్తరించడం మొదలుపెట్టారు. ఉద్యోగం వదిలేసినప్పుడు హేళన చేసిన వారంతా.. ప్రస్తుతం తమను అభినందిస్తున్నారని చెబుతున్నారు.

మహిళలు ఆటో నడుపుతున్నారేంటి..? అని ఆశ్చర్యపోతున్నారా..? వీళ్ల నిర్ణయం వెనుక..

Updated Date - 2022-03-10T02:53:32+05:30 IST