ఏం సాధించారని ప్లీనరీ ?: జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం

ABN , First Publish Date - 2022-07-09T01:23:45+05:30 IST

తిరుపతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నగరిలో నిర్వహించిన ‘‘బాదుడే బాదుడే’’ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్‌ను చంద్రబాబు తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ తీరును తూర్పార బట్టారు. వైసీపీ సర్కారుపై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఏం సాధించారని ప్లీనరీ ?:  జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం

తిరుపతి: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నగరిలో నిర్వహించిన ‘‘బాదుడే బాదుడే’’ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం జగన్‌ను తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వ తీరును తూర్పార బట్టారు. వైసీపీ సర్కారుపై ప్రశ్నల వర్షం కురిపించారు.


ఏం సాధించారని ప్లీనరీ ? 

‘‘ఏం సాధించావని ప్లీనరీ పెట్టుకున్నావు?  పోలీసులను పెట్టుకుని తిరగడం కాదు. నాడు ముద్దులు పెట్టినప్పుడు ఎలా తిరిగావో ఇప్పుడు అలా తిరుగు. జనాగ్రహం ఏమిటో అప్పుడు నీకు (జగన్‌)  తెలుస్తుంది. ఏపీలో దొరుకుతున్న మద్యంలో విషపదార్థాలు ఉన్నట్లు ల్యాబ్‌‌ల్లో బయటపడింది. దానిపై సమాధానం చెప్పరు. అరాచక పాలనకు చరమగీతం పాడాలంటే నేను ఒక్కడినే పోరాడితే సరిపోదు. మీరంతా అండగా నిలబడాలి.. ఇంటికొకరు ముందుకు రావాలి’’


చేనేతలకు 500 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ 

‘‘చేనేత కార్మికులకు అండగా ఉన్నాను. ఇకపై కూడా ఉంటా. టెక్స్‌టైల్స్ పరిశ్రమలకు అండగా నిలుస్తా. అధికారంలోకి రాగానే చేనేతలకు 500 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తాం. నగరిలో కాలుష్య నివారణకు నానో టెక్నాలజీ తెస్తా.’’నని చెప్పారు.


ఆకలి తీర్చే అన్నక్యాంటీన్లు రద్దు చేస్తారా? 

‘‘తిరుమలలో ఎన్టీఆర్ అన్నదానం కార్యక్రమం మొదలు పెట్టారు. ఆ స్ఫూర్తితోనే అన్న క్యాంటీన్లు పెట్టా. ఆకలి తీర్చే అన్నక్యాంటీన్లు రద్దు చేస్తారా? ఇదేనా పేదలపై ఉన్న ప్రేమ.  నేను తెచ్చానన్న కోపంతో అనేక ప్రాజెక్టులు ఆపారు. డ్రైనేజీ కాలువలు కూడా తవ్వలేని వ్యక్తి 3 రాజధానులు కడతాడట. డ్యాములు నిర్మించగలడా?’’ అని ప్రశ్నించారు. 


బాబాయ్‌ను చంపాడు.. అమ్మను పార్టీ నుంచి తరిమేశాడు

‘‘రాజకీయాల కోసం అందర్నీ వాడుకుని వదిలేసే రకం జగన్‌ది. బాబాయ్‌ను చంపాడు. అమ్మను పార్టీ నుంచి తరిమేశాడు. పార్టీలో ఎన్నికలు లేకుండా శాశ్వత అధ్యక్షుడిగా ప్రకటించుకున్నాడు. జగన్ నొక్కేవన్నీ ఉత్తుత్తి బటన్‌లే. ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారో ఆన్‌లైన్‌లో పెట్టగలరా? వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నష్టాల్లో ఉన్న సాక్షి.. ఇప్పుడు లాభాల బాట పట్టింది. భారతి సిమెంట్ కోసం అన్ని సిమెంట్ ధరలు పెంచేలా చేశాడు.’’


వ్యవసాయ మోటార్లకు మీటర్లు తీసేస్తా 

‘‘సీఎం జగన్ 50 మందికి కుర్చీలు లేని ఆఫీసులు ఇచ్చి బీసీలకు ఏదేదో చేసినట్లు చెబుతున్నారు. బీసీలకు రూపాయి రుణం ఇవ్వగలరా? సీఎం రిలీఫ్‌ వందల కోట్లు ఇచ్చా.. ఇప్పుడు సీఎంఆర్‌ఎఫ్‌ ఏమైంది? జగన్ పాలన.. డ్రైవింగ్ రాని వ్యక్తి బండి నడిపినట్లుంది.’’ అని చంద్రబాబు విమర్శించారు. 

Updated Date - 2022-07-09T01:23:45+05:30 IST