రాహుల్ ఓయూలో పర్యటనపై హైకోర్టు ఏం చెప్పిందంటే..?

ABN , First Publish Date - 2022-05-02T22:09:41+05:30 IST

కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించడంపై టీఎస్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.

రాహుల్ ఓయూలో పర్యటనపై హైకోర్టు ఏం చెప్పిందంటే..?

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ పర్యటించడంపై టీఎస్ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది.  ఓయూలో రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలని పిటీషనర్లు హైకోర్టుని కోరారు. విద్యార్థులతో ముఖాముఖీ కార్యక్రమం కోసం పెట్టిన అప్లికేషన్‌ని పరిశీలించాలని ఓయూ వైస్ ఛాన్సలర్‌ని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ విషయంపై ప్రభుత్వం, ఉస్మానియా యూనివర్సిటీ తరుపు న్యాయవాదులు కోర్ట్‌కు హాజరు కాలేదు. వీసీకి మరోసారి దరఖాస్తు చేసుకోవాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. కాగా రాహుల్‌ పర్యటన అనుమతిని హైకోర్టు ఓయూ వైస్ ఛాన్సలర్ నిర్ణయానికి వదిలేసింది. పిటీషనర్లు పెట్టుకున్న దరఖాస్తును ఓయూ వీసీ పరిగణనలోకి తీసుకుంటారని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. కాగా ఈపిటీషన్‌ను హైకోర్టు ముగించింది. 

Read more