ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్‌కు కారణమేంటో?

ABN , First Publish Date - 2020-11-28T09:19:36+05:30 IST

ప్రధానంగా రెండు రకాల సందర్భాల్లో ఇలా జరుగుతుంది. ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేసేటప్పుడు, ‘మీ ఫోన్లో వైరస్‌ ఉంది’ అని ఏదైనా మెసేజ్‌ కనిపిస్తే భయపడి పోయి దాన్ని ట్యాప్‌ చేశారనుకోండి.

ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాల్‌కు కారణమేంటో?

నా ఫోన్లో నా ప్రమేయం  లేకుండా కొన్ని యాప్స్‌ ఆటోమేటిక్‌ గా ఇన్‌స్టాల్‌ అవుతున్నాయి. దీనికి కారణం ఏమిటి? అడ్డుకోవడం ఎలా? : వినయ్‌సాగర్‌, కరీంనగర్‌

ప్రధానంగా రెండు రకాల సందర్భాల్లో ఇలా జరుగుతుంది.  ఇంటర్నెట్‌ బ్రౌజ్‌ చేసేటప్పుడు, ‘మీ ఫోన్లో వైరస్‌ ఉంది’ అని  ఏదైనా మెసేజ్‌ కనిపిస్తే భయపడి పోయి దాన్ని ట్యాప్‌ చేశారనుకోండి.  అప్పుడు అవాంఛిత ప్రోగ్రామ్‌ ఏదైనా మీ ఫోన్లో ఇన్‌స్టాల్‌ చేసుకున్నట్లయితే ఇకపై ఆటోమేటిక్‌గా అది డ్రాపర్‌గా పనిచేస్తుంది. కమాండ్‌ కంట్రోల్‌ సర్వర్‌కి కనెక్ట్‌ అవుతుంది. మీ ప్రమేయం లేకుండానే యాప్స్‌ని మీ ఫోన్లోకి డౌన్‌లోడ్‌ చేసి ఇన్‌స్టాల్‌ చేస్తూ ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో, కొన్ని కంపెనీలకు చెందిన కొన్ని ఫోన్‌ మోడళ్లలో ఇలా యూజర్ల ప్రమేయం లేకుండా ప్రమోషనల్‌ యాప్స్‌ని ఇన్‌స్టాల్‌ చేసే ఏర్పాటుని  ఫోన్‌ తయారీ కంపెనీలు స్వయంగా చేస్తూ ఉంటాయి. దీనికి పూర్తిగా ఆ ఫోన్‌ తయారీ కంపెనీ బాధ్యత వహించవలసి ఉంటుంది.

Updated Date - 2020-11-28T09:19:36+05:30 IST