ఇవి చేస్తే.. మీ జుట్టు బెస్ట్‌

ABN , First Publish Date - 2022-07-25T19:57:20+05:30 IST

వానాకాలం(rainy season) వచ్చిందంటే గాలిలో తేమ బాగా పెరిగిపోతుంది. దీని ప్రభావం జుట్టు

ఇవి చేస్తే.. మీ జుట్టు బెస్ట్‌

వానాకాలం(rainy season) వచ్చిందంటే గాలిలో తేమ బాగా పెరిగిపోతుంది. దీని ప్రభావం జుట్టు(hair)పై కూడా పడుతుంది. కొద్దిగా  తడిస్తే చాలు.. జుట్టు చిక్కు పడుతుంది. జిడ్డుగా తయారవుతుంది. ఇలాంటి సమస్యలను అధిగమించటానికి నిపుణులు ఇస్తున్న సూచనలేమిటో చూద్దాం... 


కాటన్‌ మంచిది.. 

చాలా మంది తల స్నానం చేసిన వెంటనే జుట్టుకు టవల్‌ను చుట్టుకుంటారు. దానివల్ల జుట్టు చిక్కు పడిపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే- జుట్టుకు ఇంట్లో ఉన్న పాత కాటన్‌ టీషర్ట్‌ లేదా మృదువైన కాటన్‌ బట్టను చుడితే మంచిది. దీని వల్ల జుట్టు చిక్కుపడదు. 


వేడి వేడి నీళ్లూ ప్రమాదమే..

వానకాలం చల్లగా ఉంటుంది కాబట్టి చాలా మందికి వేడి నీళ్లతో తలస్నానం చేసే అలవాటు ఉంటుంది. అయితే బాగా వేడి నీళ్లతో స్నానం చేయటం వల్ల జట్టు చివర్లు చీలిపోతాయి. చిక్కు కూడా పడిపోతుంది. అందువల్ల తల మీద స్నానం చేసేటప్పుడు గోరువెచ్చని నీళ్లు పోసుకొవటమే మంచిది. 


కండిషనర్‌ తప్పనిసరి..

షాంపూ ఉపయోగించిన ప్రతిసారీ కండిషనర్‌ కూడా వాడటం తప్పనిసరి. లేదంటే జట్టు రఫ్‌గా అవుతుంది.


ఎక్కువగా ముట్టుకుంటే.. 

కొందరికి జుట్టును తరచుగా సర్దుకొనే అలవాటు ఉంటుంది. దీనివల్ల చేతి వేళ్లలో ఉండే సూక్ష్మక్రిములు జట్టు లోపలికి చేరే అవకాశముంటుంది. అంతే కాకుండా ఎక్కువసార్లు సర్దుకోవటం వల్ల జట్టుపై ఒత్తిడి పడి.. త్వరగా ఊడిపోయే అవకాశముంది. 

Updated Date - 2022-07-25T19:57:20+05:30 IST