AP News: ఇంద్రకీలాద్రిపై భక్తులపై సౌకర్యాలేవి?

ABN , First Publish Date - 2022-09-27T02:05:32+05:30 IST

Vijayawada: దసరా శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అయితే భక్తులకు సౌకర్యాలు కొరవడ్డాయి. సాధారణ భక్తులతో పాటు వికలాంగులు, వృద్ధులు అమ్మవారి దర్శనానికి వస్తారు. అయితే

AP News: ఇంద్రకీలాద్రిపై భక్తులపై సౌకర్యాలేవి?

Vijayawada: దసరా శరన్నవరాత్రోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ అమ్మవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. అయితే  భక్తులకు సౌకర్యాలు కొరవడ్డాయి. సాధారణ భక్తులతో పాటు వికలాంగులు, వృద్ధులు అమ్మవారి దర్శనానికి వస్తారు. అయితే వీల్ చైర్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల తీరుపై వారి కుటుంబసభ్యులు మండిపడుతున్నారు. వీల్ చైర్లు ఏర్పాటు చేయకపోవడాన్ని కొందరు మీడియా ప్రతినిథులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ‘‘వీల్ చైర్లు లేవు. రేపు వస్తాయి అయితే ఏంటి? అని కలెక్టర్ నిర్లక్యంగా సమాధానం ఇచ్చారు. ఓంకారం దగ్గర ఓ వికలాంగుడు తన భార్య సాయంతో అతికష్టంగా అమ్మవారిని దర్శించుకున్నారు. జీవితంలో ఎప్పుడూ ఇంత ఇబ్బంది పడలేదని ఆ వికలాంగుడు తన బాధను వ్యక్తం చేశాడు. 


క్యూలైన్లో గంటల తరబడి

క్యూలైన్లలో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతుండడంతో ఆలయ అధికారులపై  భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఐపీలకు ప్రాధాన్యమిచ్చి సామాన్య భక్తులు గాలికి వదిలేస్తున్నారని మండిపడుతున్నారు. పసిపిల్లలతో గంటల తరబడి క్యూలైన్లలో నిలుచుకోలేక  భక్తులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాన్లు కూడా పనిచేయకపోవడంతో ఊపిరి ఆడటం లేదని భక్తులు పేర్కొంటున్నారు.  



Updated Date - 2022-09-27T02:05:32+05:30 IST