కమీషన్‌ ఏమాయె?

ABN , First Publish Date - 2022-01-21T05:55:40+05:30 IST

ధాన్యం సేకరించిన కమీషన్‌ ఎమాయే అని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు.

కమీషన్‌ ఏమాయె?
కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకం చేస్తున్న హమాలీలు (ఫైల్‌)

- పెండింగ్‌లో రెండు సీజన్ల ధాన్యం సేకరణ కమీషన్‌

- ఐకేపీ, పీఏసీఎస్‌, మెప్మా ద్వారా సేకరణ

- ఉమ్మడి జిల్లాలో రావాల్సింది రూ.46.61 కోట్లు

- ఆలస్యం చేస్తున్న పౌరసరఫరాల శాఖ అధికారులు

- ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిర్వాహకులు

ధాన్యం సేకరించిన కమీషన్‌ ఎమాయే అని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం సరైన సమయంలో కమీషన్‌ డబ్బులు చెల్లించకపోవడంతో నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  కొన్నేళ్ల నుంచి డీఆర్‌డీఏ ఐకేపీ, పీఏసీఎస్‌, మెప్మా వంటి సంఘాల ద్వారా  రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్వంలో ధాన్యం సేకరణ జరుగుతోంది. పీఏసీఎస్‌లతో పాటు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఉన్న ఇందిరాక్రాంతి పథం మహిళా సంఘాలు ధాన్యం సేకరణలో ముందుంటున్నాయి. పీఏసీఎస్‌లకు పోటీగా కొనుగోళ్లు చేస్తూ, వచ్చిన కమీషన్‌తో లబ్ధిపొందుతున్నాయి.  కానీ  నిర్వాహకులకు ఇవ్వాల్సిన కమీషన్‌ను మాత్రం ప్రభుత్వం సీజన్ల కొద్ది పెండింగ్‌లో ఉంచడంతో   ఇబ్బందులు తప్పడం లేదు.

- ఆంధ్రజ్యోతి, వనపర్తి

ప్రభుత్వ ఆదేశాల మేరకు ధాన్యం సేకరించిన కొను గోలు కేంద్రాల నిర్వాహకులు సరైన సమయంలో కమీష న్‌ డబ్బులు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏటా ధాన్యం ఉత్పత్తి పెరుగుతుండగా, అందుకు తగ్గట్లు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం సేకరిస్తున్న వారికి కమీషన్‌ డబ్బులు  చెల్లించకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కొన్నేళ్ల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వ ర్వంలోనే ధాన్యం సేకరణ జరుగుతోంది. డీఆర్‌డీఏ ఐకేపీ, పీఏసీఎస్‌, మెప్మా వంటి సంఘాల ద్వారా ప్రభుత్వం ఊరూరా ధాన్యం సేకరించి, పౌరసరఫరాల సంస్థకు అప్ప గిస్తోంది. పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో వాటిని మిల్ల ర్లకు సీఎంఆర్‌ కోసం కేటాయించి, వచ్చిన బియ్యాన్ని ఎఫ్‌సీఐకి అప్పగిస్తోంది. ఆ బియ్యం కేంద్రం తీసుకుని, ప్రతీ నెలా తెల్ల రేషన్‌ కార్డు లబ్ధిదారులకు రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేస్తోంది. ఈ మొత్తం ప్రక్రియలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల పాత్ర చాలా కీలకం. పీఏసీఎస్‌లతో పాటు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ఉన్న ఇందిరాక్రాంతి పథం మహిళా సంఘాలు కొన్నేళ్లుగా ధాన్యం సేకరణలో ముందుటున్నాయి. పీఏసీఎస్‌లకు పో టీగా కొనుగోళ్లు చేస్తూ, వచ్చిన కమీషన్‌తో లబ్ధిపొందు తున్నాయి. కొనుగోళ్లు జరుగుతున్నప్పుడే రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్న ప్రభుత్వం,  నిర్వాహకులకు ఇవ్వాల్సిన కమీషన్‌ను మాత్రం సీజన్ల కొద్ది పెండింగ్‌లో ఉంచు తోంది. 

రెండు సీజన్లలో 12.04లక్షల ఎకరాల్లో సాగు

గతంతో పోల్చితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. వానాకాలంలో 6.31 లక్ష ల ఎకరాల్లో, యాసంగిలో 5.73 లక్షల ఎకరాల్లో వరి సా గవుతోంది. వానాకాలంలో 16.16 లక్షల మెట్రిక్‌ టన్నులు, యాసంగిలో 15.04 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్ప త్తి అవుతోంది. వానాకాలంలో రెండు లక్షల మెట్రిక్‌ ట న్నుల ధాన్యం వరకు గృహ అవసరాలకు పోగా, మిగతా వి విక్రయిస్తున్నారు. యాసంగిలో మాత్రం పూర్తిగా కొనుగోలు కేంద్రాలకే వెళ్తోంది. ఈ రకంగా రెండు సీజ న్లకు కలిపి సుమారు 29 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. వీటిని పీఏసీఎస్‌, మె ప్మా, ఐకేపీ ఆధ్వర్యంలో సేకరిస్తున్నారు. ప్రధానంగా ఐకే పీ, మెప్మాలో గుర్తించిన మహిళా సంఘాలు ధాన్యం కొ నుగోలు చేస్తుండగా, మెట్రిక్‌ టన్నుకు రూ.320 చొప్పున ప్రభుత్వం వారికి కమీషన్‌ ఇస్తోంది. ఏ సీజన్‌ కమీషన్‌ ఆ సీజన్‌ పూర్తయిన వెంటనే ఇవ్వాల్సి ఉండగా, తీవ్ర జాప్యం జరుగుతోంది. ఏడాదిలో నాలుగు నుంచి ఐదు నెలలపాటు ధాన్యం సేకరణ కోసం మిగతా పనులు వదులుకుని శ్రమిస్తున్న మహిళా సంఘాలకు సమయా నికి కమీషన్‌ ఇవ్వకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

రెండు సీజన్ల కమీషన్‌ పెండింగ్‌

ధాన్యం సేకరించిన నిర్వాహకులకు 2019-20 వానా కాలం, యాసంగి సీజన్ల కమీషన్‌ పూర్తిగా చెల్లించిన ప్పటికీ, 2020-2021 సంవత్సరం రెండు సీజన్ల కమీషన్‌ డబ్బులు చెల్లించ లేదు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో రెండు సీజన్లకు కలిపి ప్రభుత్వం రూ.46.61 కోట్లు మహిళా సంఘాలకు, పీఏసీఎస్‌లకు చెల్లించాల్సి ఉంది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో రెండు సీజన్లకు కలిపి 2.17 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా, రూ.7.60 కోట్ల కమీషన్‌గా చెల్లించాల్సి ఉంది. నారాయణపేట జిల్లాలో సుమారు 2.24 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా, రూ.7.85 కోట్లు, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 4.44 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి రూ.15.55 కోట్లు, జోగుళాంబ గద్వాల జిల్లాలో 89 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి రూ.3.07 కోట్లు, వనపర్తి జిల్లాలో 3.93 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యానికి రూ.12.54 కోట్లు కమీషన్‌ రూపంలో చెల్లించాల్సి ఉంది.

 



Updated Date - 2022-01-21T05:55:40+05:30 IST