Chitrajyothy Logo
Advertisement
Published: Fri, 19 Aug 2022 17:18:35 IST

Prabhas - Maruthi combo : ఈ సినిమా సంగతేంటి?

twitter-iconwatsapp-iconfb-icon

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా మారుతి (Maruthi) ఓ సినిమా తెరకెక్కించబోతున్నట్టు ఎప్పటి నుంచో వార్తలొస్తున్నాయి. ప్రభాస్, మారుతి వేరు వేరు సందర్భాల్లో ఈ సినిమా గురించి మాట్లాడారు. కానీ చిత్రాన్ని ఇంతవరకూ అధికారికంగా ప్రకటించనేలేదు. మారుతి అండ్ టీమ్ ఈ సినిమా స్ర్కిప్ట్‌ను లాక్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి ‘రాజాడీలక్స్’ (Raja deluxe) అనే టైటిల్ ప్రచారంలో ఉండగా.. ఒక థియేటర్ బ్రాక్ డ్రాప్ లో సాగే హారర్ మూవీ అని కథనాలు కూడా వినిపించాయి.  ‘పక్కా కమర్షియల్’ (Pakka Commercial) చిత్రం విడుదలయ్యాకా ప్రభాస్ సినిమా మొదలవుతుందని ఇదివరకు వార్తలొచ్చాయి. అయితే ఆ సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో.. ప్రభాస్ అభిమానుల భయం మరింత పెరిగింది. దాంతో ఈ సినిమా ఆగిపోతే బాగుండనని మనసులోనే దండాలు పెట్టేసుకుంటున్నారు. వారి కోరికకు తగ్గట్టుగానే ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు నత్తనడకన సాగుతోంది.

ఈ సినిమాను ఎంతో గ్రాండ్‌గా తీయాలనుకున్న ప్రముఖ నిర్మాత డివివి దానయ్య (DVV Danayya) ‘పక్కా కమర్షియల్’ రిజల్ట్ వల్ల పక్కకు వెళ్ళిపోయినట్టు భోగట్టా. ఆయన ఇప్పటికే ప్రభాస్ కు రూ. 50కోట్లు అడ్వాన్స్ ఇచ్చారట. అది తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. అందుకే మారుతి ఇప్పుడు మరో నిర్మాత కోసం వెతుతున్నట్టు సమాచారం. ప్రభాస్ తో సినిమా అంటే ఎంతటి నిర్మాతైనా ముందుకొస్తాడు. కాకపోతే మారుతి దర్శకుడు అనగానే వారంతా వెనక్కి వెళ్ళిపోతున్నారట. పైగా ప్రభాస్ చేతిలో ఇప్పుడు చాలా సినిమాలున్నా్యి. ఇంత బిజీలోనూ మారుతి సినిమాకి ఆయన డేట్స్ ఇస్తాడా లేదా అన్నదే డౌట్. 

అయితే ఈ సినిమా యూవీ క్రియేషన్స్ (UV Creations) వారి చేతుల్లోకి వెళ్ళడానికి కూడా ఆస్కారాలున్నాయి. మారుతికి, యూవీ వారికున్న అనుబంధం అలాంటిది. ఒక వేళ యూవీ క్రియేషన్స్ వారు కానీ బరిలోకి దిగితే ప్రాజెక్ట్ ఉన్నట్టు.. లేకపోతే లేనట్టే అంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మారుతి ఏం చేస్తాడో.. సినిమా ఉంటుందో లేదో తెలియాలంటే.. మరికొద్ది రోజులు ఆగాల్సిందే. 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement