Abn logo
May 21 2020 @ 22:28PM

హరీష్ ‘దాగుడు మూతలు’ ఆడటం లేదా?

దర్శకుడు హరీష్ శంకర్, అల్లు అర్జున్‌తో చేసిన ‘డీజే’ తర్వాత ఇద్దరు హీరోలతో ఓ సినిమా చేయబోతున్నట్లుగా తెలిపారు. ‘దాగుడు మూతలు’ అనే టైటిల్ కూడా చెప్పారు. టాలీవుడ్‌లోని ఇద్దరు యంగ్ హీరోలతో ఈ ‘దాగుడు మూతలు’ ఆడతానని చెప్పిన ఆయన ఆ తర్వాత వరుణ్ తేజ్‌తో ‘గద్దలకొండ గణేష్’ అనే చిత్రాన్ని రూపొందించారు. ఇక ‘దాగుడు మూతలు’ విషయంలో టాలీవుడ్‌లోని హీరోలలో చాలా పేర్లు వినిపించాయి. సాయిధరమ్ తేజ్, నితిన్, నాని ఇలా చాలా పేర్లు ‘దాగుడు మూతలు’ ఆడే హీరోల లిస్ట్‌లోకి చేరాయి. కానీ ఆ ప్రాజెక్ట్ మాత్రం కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం హరీష్ శంకర్ మరోసారి పవన్ కల్యాణ్‌తో చేసే చిత్రానికి రెడీ అవుతున్నారు. మైత్రీ మూవీస్ బ్యానర్‌లో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. 


పవన్ కల్యాణ్ సినిమా తర్వాత మరోసారి 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లో హరీష్ సినిమా చేయనున్నారు. అన్నీ వర్కవుట్ అయితే ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించే అవకాశం ఉంది. ఈ లెక్క ప్రకారం చూస్తే.. హరీష్ చేయాలనుకున్న ‘దాగుడు మూతలు’ అటకెక్కినట్లే కనిపిస్తుంది. అసలు ఈ మధ్య కాలంలో ఈ సినిమా గురించి హరీష్ కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. అసలు ఈ సినిమా ఉంటుందో, ఉండదో తెలియాలంటే.. మళ్లీ హరీష్ నుంచి ప్రకటన రావాల్సిందే. అప్పటి వరకు ఆ ప్రాజెక్ట్‌కు ‘దాగుడు మూతలు’ తప్పవు. 

Advertisement
Advertisement
Advertisement