కార్పొరేషన్‌లో నిధుల మాటేమిటి ?

ABN , First Publish Date - 2022-05-28T05:11:49+05:30 IST

రాష్ట్రంలో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల అభివృద్ధి కోసం సీఎం జగన్‌ 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయ డం మంచిదే కానీ ఆ కార్పొరేషన్లకు నిధు ల మాటేమిటని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

కార్పొరేషన్‌లో నిధుల మాటేమిటి ?
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ నేతలు

జనాభాలో 85 శాతం ఉన్న బీసీల అభివృద్ధికి లక్ష కోట్లు ఖర్చు చేయాలి

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ నేతల డిమాండ్‌

రాయచోటిటౌన్‌, మే27: రాష్ట్రంలో బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీల అభివృద్ధి కోసం సీఎం జగన్‌ 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేయ డం మంచిదే కానీ ఆ కార్పొరేషన్లకు నిధు ల మాటేమిటని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం అన్నమయ్య జిల్లా  కేంద్రం ఎన్జీఓ హోంలో జరిగిన విలేకరు ల సమావేశంలో బీసీ, ఎస్టీ, ఎస్టీ, మైనార్టీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బోరంపల్లి ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి మంద కృష్ణయ్యమాదిగ, రాష్ట్ర నేత వాల్మీకి రమణ, స్థానిక నేతలు అడ్వకేట్‌ ఈశ్వరయ్య, వడ్డెర విద్యావంతుల వేదిక కన్వీనర్‌ జీవానందం, రమణయ్య, సుండుపల్లె మండలం బీసీ నేత రవిశంకర్‌, జిల్లా  కురబ సంఘం అధ్యక్షులు సురేంద్రరెడ్డి, ఉదయ్‌కుమార్‌, యాదవ సంఘం వైవీ శివయ్య మట్లాడుతూ

రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 85 శాతం జనాభా ఉన్నారని, వారి అభివృద్ధి కోసం లక్ష కోట్లకుపైగా ఖర్చు చేయాలన్నారు. కార్పొరేషన్లను ఏర్పాటు చేసి రెండేళ్లయి నా ఇంతవరకు ఒక్క కార్పొరేషన్‌ కైనా రూపాయి నిధులైనా కేటాయించారా అ ని ప్రశ్నించారు. బస్సుయాత్రకు వచ్చే మంత్రులంతా నిధులు విడుదలయ్యేలా పాటుపడాలన్నారు. కార్పొరేషన్లకు నిధు లు విడుదల చేయని పక్షంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీ లు, మంత్రులు ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు.

Updated Date - 2022-05-28T05:11:49+05:30 IST