ఈ ఫోన్... యమ ‘స్మార్ట్’ గురూ...

ABN , First Publish Date - 2021-08-23T23:21:59+05:30 IST

మార్కెట్‌లొ రోజుకో కొత్త స్మార్ట్‌ ఫోన్ విడుదలవుతోంది.

ఈ ఫోన్... యమ ‘స్మార్ట్’ గురూ...

హైదరాబాద్ : మార్కెట్‌లొ రోజుకో కొత్త స్మార్ట్‌ ఫోన్  విడుదలవుతోంది. అత్యాధునిక ఫీచర్లతో ఇవి...   వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు ఉండేలా తయారు చేస్తూ విడుదల చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌, ల్యాప్‌ట్యాప్‌ ఉత్పత్తుల తయారీదారు లెనోవో కంపెనీకి చెందిన మోటరోలా... భారత మార్కెట్‌లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అదే ‘మోటరోలా ఎడ్జ్‌ 20’. మోటరోలా ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌ వేరియంట్లు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. మోటరోలా ఎడ్జ్‌ 20 స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్‌లో ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ అమ్మకాలను జరపనుంది.


మోటరోలా ఎడ్జ్‌ 20 ను మంగళవారం‘ఆగస్టు 24),  మోటరోలా ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌ విక్రయాలను ఆగస్టు 27 న ప్రారంభించాలని మోటరోలా భావించింది. కాగా... ప్రస్తుతం ఈ రెండు స్మార్ట్‌ఫోన్లను ఒకే రోజున అంటే ఆగస్టు 24 న ఫ్లిప్‌కార్ట్‌లో ప్రి-బుకింగ్స్‌ జరిపేందుకు మోటరోలా నిర్ణయించింది. మోటరోలా ఎడ్జ్‌ 20( 8GB ర్యాం + 128 జీబీ) ధర రూ. 29,999 కాగా, మోటరోలా ఎడ్జ్‌ 20 ఫ్యూజన్‌ (6 జీబీ ర్యాం + 128 జీబీ) ధర రూ. 21,499. ఇక వీటి స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి. 

మోటరోలా ఎడ్జ్‌ 20... 

► ఆండ్రాయిడ్ 11 విత్‌ మైయూఎక్స్‌ సపోర్ట్‌

► 6.7-అంగుళాల ఫుల్-హెచ్‌డీ + (1,080×2,400 పిక్సెల్స్) ఓఎల్‌ఈడీ మాక్స్ విజన్ డిస్‌ప్లే

► ఆక్టా-కోర్ క్వాలకం స్నాప్‌ డ్రాగన్ 778జీ

► 8జీబీ ర్యామ్‌+128 జీబీస్టోరేజ్‌

► ట్రిపుల్ రియర్ కెమెరా (108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌,+8 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్+16 మెగాపిక్సెల్ సెన్సార్‌)

► 32 మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా

► 4000ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీ

► 30 వాట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ చేస్తుంది. టైప్‌ సీ చార్జర్‌, 5జీ సపోర్ట్‌. 

Updated Date - 2021-08-23T23:21:59+05:30 IST