రామలింగేశ్వరాలయాన్ని సందర్శించిన కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-11-25T08:26:51+05:30 IST

మండలంలోని బండనాగారం గ్రామ సమీపంలోని రామలింగేశ్వరాలయాన్ని కలెక్టర్‌ నిఖిల మంగళవారం రాత్రి సందర్శించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి...

రామలింగేశ్వరాలయాన్ని సందర్శించిన కలెక్టర్‌

బచ్చన్నపేట, నవంబరు 24: మండలంలోని బండనాగారం గ్రామ సమీపంలోని రామలింగేశ్వరాలయాన్ని కలెక్టర్‌ నిఖిల మంగళవారం రాత్రి సందర్శించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. కాగా ఆలయ ప్రాశస్త్యాన్ని పూజారి అంజనేయులును అడిగి తెలుసుకున్నారు. 60 ఎకరాల పరుపుబండపై ఉన్న ఈ జంట ఆలయాల సమీపంలోని గుండాలు, విగ్రహాలను పరిశీలించారు. కార్తీక పౌర్ణమి రోజు ఆలయాన్ని మరోమారు సందర్శిస్తానని, అభివృద్ధి కోసం పురావస్తుశాఖకు లేఖ రాస్తానని అన్నారు. 

Updated Date - 2020-11-25T08:26:51+05:30 IST