కళ్లల్లో కారం చల్లి..

ABN , First Publish Date - 2022-01-21T05:58:02+05:30 IST

కళ్లల్లో కారం చల్లి..

కళ్లల్లో కారం చల్లి..

భర్త ప్రాణాలు కాపాడిన భార్య

శంభునిపేట (వరంగల్‌), జనవరి 20: ఉమ్మడి వరంగల్‌ జిల్లా లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వేముల భూపాల్‌పై హత్యాయత్నం జరిగింది. బుధవారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు కత్తులతో దాడికి య త్నిస్తుండగా, ఆయన భార్య అ ప్రమత్తమై వారి కళ్లల్లో కారం చల్లడంతో  పరారయ్యారు. భూపాల్‌ స్వల్ప గాయాలతో బ యటపడ్డాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం....

వరంగల్‌లోని శంభునిపేట విశ్వనాథకాలనీలో నివాసముంటున్న భూపాల్‌కు భార్య, కూతురు ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి లారీకి మరమ్మతులు చేయించి భూపాల్‌ అర్ధరాత్రి 1.30గంటలకు ఇంటికి చేరుకున్నాడు. సుమారు అర్ధరాత్రి 2గంటల ప్రాంతం లో ఓ ఆటోలో ఐదుగురు వ్యక్తులు వచ్చి ఇంటి తలుపులు కొట్టారు. భూపాల్‌ భార్య కల్యాణి తలుపులు తెరిచి ఎవరని అడగగా... ‘భూ పాల్‌ అన్న క్రాంతి ఎక్కడ..?’ అని వారు ప్రశ్నించారు.  ఇదే సమ యంలో వారి మాటలు విని భూపాల్‌ వచ్చాడు. ఏం కావాలని అ డుగుతుండగానే వారు భూపాల్‌ను చుట్టుముట్టారు. వారి మధ్య వాగ్వాదం జరుగుతుండగా, కళ్యాణి అదే కాలనీలో నివాసం ఉం టున్న క్రాంతికి, తన సోదరుడికి ఫోన్‌లో సమాచారం ఇచ్చింది.  

ఈ క్రమంలోనే కుమార్‌పల్లికి చెందిన రంజిత్‌ అనే వ్యక్తి కత్తితో భూపాల్‌పై దాడి చేయగా.. అది గురితప్పడంతో బ్రాస్‌లెట్‌కు తగిలి స్వల్పంగా గాయమైంది. దాడి ప్రయత్నాన్ని గమనించిన కల్యాణి...  ఇంట్లోకి వెళ్లి కారం పొడి తీసుకువచ్చి దుండగులపై చల్లింది. వారి షాక్‌కు గురై అయోమయం చెందుతుండగానే క్రాంతితో పాటు పలువురు వ్యక్తులు రావడంతో  దుండగులు పరారయ్యారు. కళ్లల్లో కారం పడిన గౌస్‌ అనే వ్యక్తి జారిపడటంతో తలకు గాయమైం ది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలానికి చేరుకుని గౌస్‌ను,  ఆ టోను పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించారు. దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించి తమకు రక్షణ కల్పించాలని కళ్యాణి మిల్స్‌కాలనీ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. కాగా, భూపాల్‌ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. 

ఆర్థిక లావాదేవీలే కారణం..?

భూపాల్‌పై దాడకి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన గొడవలే కారణమని తెలిసింది.  పోచమ్మమైదాన్‌కు చెందిన ఓ కుటుంబం హనుమకొండకు చెందిన వ్యక్తి వద్ద అప్పు తీసుకుంది. అప్పు తీర్చే విషయంలో గడువు కోరుతూ భూపాల్‌ సోదరుడు క్రాంతి మధ్యవర్తిత్వం నెరిపాడు.  ఈ క్రమంలో అప్పు ఇచ్చిన వారు క్రాంతిపై కోపం పెంచుకున్నారు. అతడికి భూపాల్‌ మద్దతుగా ఉండటంతో టార్గెట్‌ చేసుకున్నారు.  భూపాల్‌ను కడతేర్చితే క్రాంతి తమ దారికి వస్తాడని భావించి  ఈ ఘాతుకానికి పాల్పడినట్టు తెలుస్తోంది.

ఎమ్మెల్యే నరేందర్‌ ఆరా

సంఘటన విషయం తెలియగానే తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ వెంటనే స్పందించి,  భూపాల్‌కు ఫోన్‌ చేశారు. ఘటన వివరాలు తెలుసుకున్నారు. భూపాల్‌ కుటంబసభ్యులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ నాయకులతోపాటు పలువురు అధికారులు, నాయకులు ఈ దాడిని ఖండించారు. 

 

Updated Date - 2022-01-21T05:58:02+05:30 IST