WETA-ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ తెలుగు అసోసియేష‌న్ ఆధ్వర్యంలో ఘ‌నంగా ‘మ‌ద‌ర్స్ డే’ వేడుకలు!

ABN , First Publish Date - 2022-05-16T02:53:05+05:30 IST

అమ్మ లేకపోతే జననం లేదు. అమ్మ లేకపోతే గమనం లేదు. అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు. అమ్మ లేకపోతే అసలు సృష్టే లేదు. అలాంటి అమ్మ ఔన్నత్యాన్ని వేనోళ్ల కొనియాడుతూ.. నిర్వహించుకునే `అంత‌ర్జాతీయ మ‌ద‌ర్స్ డే` ను అమెరికాలోని ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ తెలుగు అసోసియేష‌న్ ఘ‌నంగా నిర్వహించింది.

WETA-ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ తెలుగు అసోసియేష‌న్ ఆధ్వర్యంలో ఘ‌నంగా ‘మ‌ద‌ర్స్ డే’ వేడుకలు!

అమ్మ లేకపోతే జననం లేదు. అమ్మ లేకపోతే గమనం లేదు. అమ్మ లేకపోతే సృష్టిలో జీవం లేదు. అమ్మ లేకపోతే అసలు సృష్టే లేదు. అలాంటి అమ్మ ఔన్నత్యాన్ని వేనోళ్ల కొనియాడుతూ.. నిర్వహించుకునే `అంత‌ర్జాతీయ మ‌ద‌ర్స్ డే` ను అమెరికాలోని ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ తెలుగు అసోసియేష‌న్ ఘ‌నంగా నిర్వహించింది. ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్ తెలుగు అసోసియేష‌న్  వ్యవ‌స్థాప‌క అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 14న యూనివ‌ర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర సెంట‌ర్‌లో మ‌ద‌ర్స్ డేను అత్యంత ఘ‌నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాన్సుల్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా, శాన్‌ఫ్రాన్సిస్కో డాక్టర్ టీవీ నాగేంద్ర ప్రసాద్ హాజ‌ర‌య్యారు. అదేవిధంగా దాదాపు 500 మందికి పైగా తెలుగు వారు హాజ‌రై.. ఈ కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేశారు.


మ‌ద‌ర్స్ డే కార్యక్రమంలో తొలుత ప‌లు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మ గొప్పద‌నాన్ని.. ప్రతి వ్యక్తి జీవితంలో అమ్మ పోషించే అద్వితీయమైన పాత్రను.. తాను క‌రుగుతూ.. కుటుంబానికి వెలుగులు పంచే అమ్మలోని ఔన్నత్యాన్ని క‌ళాకారులు ప‌లు రూపాల్లో ప్రద‌ర్శించారు. గురు సింధు సురేంద్ర నాట్యంతో అల‌రించ‌గా, తెలుగు సినీ రంగానికి చెందిన గాయ‌కులు సుమంగ‌ళి, వేణు శ్రీరంగం త‌మ శ్రావ్యమైన గానంతో తెలుగు చిత్రాల్లోని అమ్మ గొప్పద‌నాన్ని క‌ళ్లకు క‌ట్టే గీతాల‌ను ఆల‌పించి అంద‌రినీ మంత్రముగ్ధుల‌ను చేశారు. కమ్యూనిటీ పెద్దలు శ్రీమతి పద్మావతి రఘు రెడ్డి (శాంటా క్లారా కమీషనర్), డాక్టర్ హనిమి రెడ్డి ,డాక్టర్ రమేష్ జొప్ర ,సిలికాన్ ఆంధ్ర చైర్మన్ ఆనంద్ కూచిభొట్ల తదితరులు హాజరై అమ్మ గొప్పతనాన్ని విశదీకరించారు.


ఈ కార్యక్రమంలో శైల‌జ క‌ల్లూరి(ప్రెసిడెంట్ ఎలెక్ట్‌),  ర‌త్నమాల‌ వంకా(సాంస్కృతిక విభాగం), అనురాధ అలిశెట్టి(కార్యద‌ర్శి), అభితేజ కొండా(స‌ల‌హాదారు),  హైమ అనుమాండ్ల(కాలిఫోర్నియా ఆర్‌వీపీ), జ్యోతి పెంట‌ప‌ర్తి(క‌మ్యూనిటీ స‌ర్వీసెస్), విశ్వ వేణురెడ్డి(కోశాధికారి), పూజ ల‌క్కాడి(శాక్రమెంటో ఆర్‌వీపీ), ప్రశాంతి కూచిభ‌ట్ల(జాయింట్ సెక్రట‌రీ), సరోజ వివేక్(సలహా మండలి) త‌దిత‌రులు పాల్గొని.. కార్యక్రమాన్ని  విజయవంతం చేశారు. 

Updated Date - 2022-05-16T02:53:05+05:30 IST