అమర వీరులను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి

ABN , First Publish Date - 2022-08-18T06:27:39+05:30 IST

స్వాతంత్య్ర సమరంలో సమిధులై అమ రులైన వీరులను నేటి యువత ఆదర్శంగా తీసుకు ని ముందుకు నడవాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు.

అమర వీరులను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి
క్విట్‌ ఇండియా స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి

 కలెక్టర్‌ ప్రశాంతి
భీమవరం టౌన్‌, ఆగస్టు 17 : స్వాతంత్య్ర సమరంలో సమిధులై అమ రులైన వీరులను నేటి యువత ఆదర్శంగా తీసుకు ని ముందుకు నడవాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి అన్నారు. తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలోని క్విట్‌ ఇండియా స్తూపం వద్ద బుధవారం శ్రీవిజ్ఞాన వేదిక, లయన్స్‌ క్లబ్‌, క్విట్‌ ఇండియా స్తూపం నిర్మాణ కమిటీ, సర్వోదయ మండలి సంయుక్త ఆధ్వర్యంలో  క్విట్‌ ఇండియా దినోత్సవం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కలెక్టర్‌ పాల్గొని మాట్లాడుతూ క్విట్‌ ఇండియా ఉద్యమం  1942 ఆగస్టు 8న  మహాత్మా గాంధీ అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ బాంబే సమావేశంలో ఇచ్చిన పిలుపు మేరకు ప్రారంభమయిందన్నారు. అదే స్ఫూర్తితో 1942 ఆగస్టు 17 భీమవరం తాలూకా ఆఫీస్‌ ఆవరణలోని పోలీస్‌ స్టేషన్‌పై జెండా ఎగురవేసే ప్రయత్నంలో వేగేశ్న నారాయణ రాజు, గొట్టుముక్కల బలరామరాజు, ఉద్దరాజు వెంకట రామ రాజు, ముందా బ్రహ్మం అనే 9 ఏళ్ల బాలుడు బ్రిటీ్‌ష్‌ పోలీసుల తూటాలకు బలైయి అమరులయ్యారన్నారు. నేటి యువత వారి స్ఫూర్తితో ముందుకుసాగాలన్నారు. ఈ సందర్బంగా క్విట్‌ ఉద్య మంలో అశువులు బాసిన సమరయోధుల కుటుం బ సభ్యులను ఆమె సత్కరించారు. ఆజాకీ కా అమృతోత్సవంలో భాగంగా హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపాళ్లకు, ప్రధానోపా ధ్యాయులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీఈవో ఆర్‌.వెంకట రమణ, మునిసిపల్‌ కమిషనర్‌ ఎస్‌.శివరామ కృష్ణ, తహసీల్దార్‌ వై.రవి కుమార్‌, శ్రీవిజ్ఞాన వేదిక కన్వీనర్‌ చెరుకువాడ రంగసాయి, ఇందుకూరి ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-18T06:27:39+05:30 IST