హోల్డర్‌ ధాటికి కుదేల్‌..

ABN , First Publish Date - 2020-07-10T07:31:50+05:30 IST

తొలి రోజు క్రికెట్‌ అభిమానుల ఉత్సాహాన్ని నీరుగార్చిన వరుణుడు గురువారం రెండో రోజు మాత్రం కరుణించాడు. అటు వాతావరణ పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకున్న వెస్టిండీస్‌ పేసర్లు కదం తొక్కడంతో ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పలేవు

హోల్డర్‌ ధాటికి కుదేల్‌..

సౌతాంప్టన్‌: తొలి రోజు క్రికెట్‌ అభిమానుల ఉత్సాహాన్ని నీరుగార్చిన వరుణుడు గురువారం రెండో రోజు మాత్రం కరుణించాడు. అటు వాతావరణ పరిస్థితులను చక్కగా సద్వినియోగం చేసుకున్న వెస్టిండీస్‌ పేసర్లు కదం తొక్కడంతో ఇంగ్లండ్‌కు కష్టాలు తప్పలేవు. ముఖ్యంగా కెప్టెన్‌ హోల్డర్‌ (6/42) టెస్టుల్లో తన బెస్ట్‌ బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ పతనాన్ని శా సించాడు. అతడికి గాబ్రియెల్‌ (4/62) సహకరించాడు. దీంతో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 67.3 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో 87 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన స్థితిలో కెప్టెన్‌ స్టోక్స్‌ (43), బట్లర్‌ (35) ఆదుకున్నారు. చివర్లో బెస్‌ (31 నాటౌట్‌) క్రీజు లో నిలిచి జట్టుకు గౌరవప్రదమైన స్కో రును అందించాడు. ఇక చివరి సెషన్‌లో బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ ఆత్మవిశ్వాసంతో ఆడుతోంది. అయితే వెలుతురులేమితో ఆటను కాస్త ముందుగానే ముగించారు. దీంతో రోజు ముగిసే స మయానికి విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 19.3 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 57 పరుగులు చేసింది. క్రీజులో బ్రాత్‌వైట్‌ (20) హోప్‌ (3) ఉన్నారు.


ముందు గాబ్రియెల్‌.. తర్వాత హోల్డర్‌

35/1 ఓవర్‌నైట్‌ స్కోరుతో రెండో రోజు బ్యాటింగ్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌కు తేమతో కూడిన పిచ్‌పై బ్యాటింగ్‌ సవాల్‌గా మారింది. దీంతో తొలి సెషన్‌లోనే మూడు వికెట్లను కోల్పోవా ల్సి వచ్చింది. అయితే స్టోక్స్‌, బట్లర్‌ ఆరో వికెట్‌కు అందించిన 67 పరుగుల భాగస్వామ్యం జట్టు పరువు కాపాడింది. ఆరంభంలో గాబ్రియెల్‌ పేస్‌ ధాటికి టాపార్డర్‌ కష్టాలు పడింది. ఓపెనర్‌ బర్న్ప్‌ (30) ఒక్కడే కాస్త నిలబడినా గాబ్రియెల్‌ అతడిని ఫుల్‌ లెంగ్త్‌ డెలివరీతో ఎల్బీగా పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత హోల్డర్‌ షార్ట్‌ పిచ్‌, స్లో బంతులకు జట్టు 87 పరుగులకే 5 వికెట్లతో కుదేలైంది. మరో రెండు పరుగులకే స్టోక్స్‌ ఇచ్చి న క్యాచ్‌ను లాంగ్‌ లెగ్‌లో రోచ్‌ వదిలేయడంతో ఇంగ్లండ్‌ బతికిపోయింది. ఆతర్వాత బట్లర్‌, స్టోక్స్‌ కలిసి విండీస్‌ బౌలర్లను దీటు గా ఎదుర్కొన్నారు. 


లంచ్‌ బ్రేక్‌ తర్వాత వెలుతురులేమితో రెండో సెషన్‌ ఆలస్యంగా ఆరంభమైంది. అయితే ఇంగ్లండ్‌కు హోల్డర్‌ అసలైన ఝల క్‌ ఇస్తూ వరుస ఓవర్లలో మూడు వికెట్లు తీశాడు. ముందుగా ఆఫ్‌సైడ్‌ వైపు వెళుతున్న బంతిని టచ్‌ చేయడంతో స్టోక్స్‌ ఇచ్చిన క్యాచ్‌ కీపర్‌ చేతుల్లో పడింది. ఆ తర్వాత హోల్డర్‌ ధాటికి బట్లర్‌, ఆర్చర్‌ (0), వుడ్‌ వికెట్లను కూడా కోల్పోయింది. చివర్లో బెస్‌ వరుస ఫోర్లతో జట్టు స్కోరు ను 200 దాటించగలిగాడు. గాబ్రియెల్‌ సూపర్‌ యార్కర్‌తో అండర్సన్‌ (10) వికెట్‌ తీయగా జట్టు తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది.


స్కోరుబోర్డు

ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: బర్న్స్‌ (ఎల్బీ) గాబ్రియెల్‌ 30; సిబ్లే (బి) గాబ్రియెల్‌ 0; డెన్లీ (బి) గాబ్రియెల్‌ 18; క్రాలే (ఎల్బీ) హోల్డర్‌ 10; స్టోక్స్‌ (సి) డౌరిచ్‌ (బి) హోల్డర్‌ 43; పోప్‌ (సి) డౌరిచ్‌ (బి) హోల్డర్‌ 12; బట్లర్‌ (సి) డౌరిచ్‌ (బి) హోల్డర్‌ 35; బెస్‌ (నాటౌట్‌) 31; ఆర్చర్‌ (ఎల్బీ) హోల్డర్‌ 0; వుడ్‌ (సి) హోప్‌ (బి) హోల్డర్‌ 5; అండర్సన్‌ (బి) గాబ్రియెల్‌ 10; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: 67.3 ఓవర్లలో 204 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-0, 2-48, 3-51, 4-71, 5-87, 6-154, 7-157, 8-157, 9-174, 10-204. బౌలింగ్‌: కీమర్‌ రోచ్‌ 19-6-41-0; గాబ్రియెల్‌ 15.3-3-62-4; జోసెఫ్‌ 13-4-53-0; హోల్డర్‌ 20-6-42-6.

విండీస్‌ తొలి ఇన్నింగ్స్‌: బ్రాత్‌వైట్‌ (బ్యాటింగ్‌) 20; క్యాంప్‌బెల్‌ (ఎల్బీ) అండర్సన్‌ 28; హోప్‌ (బ్యాటింగ్‌) 3; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 19.3 ఓవర్లలో 57/1. వికెట్ల పతనం: 1-43. బౌలింగ్‌: అండర్సన్‌ 8-4-17-1; ఆర్చర్‌ 6-0-20-0; వుడ్‌ 3.3-1-8-0; స్టోక్స్‌ 2-1-6-0.

Updated Date - 2020-07-10T07:31:50+05:30 IST