చిన్న జాగ్రత్తలతో పెనుప్రమాదాలు నివారించవచ్చు

ABN , First Publish Date - 2021-04-17T05:04:41+05:30 IST

అగ్ని ప్రమాదాలు జరగకుండా చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకో వడం ద్వారా పెను ప్రమాదాలు నివారించ వచ్చని సహాయ జిల్లా అగ్నిమాపక శాఖాధి కారి కె.శ్రీనివాసరావు అన్నారు.

చిన్న జాగ్రత్తలతో పెనుప్రమాదాలు నివారించవచ్చు
నిడదవోలులో అగ్ని ప్రమాదాలపై అవగాహన

నిడదవోలు, ఏప్రిల్‌ 16: అగ్ని ప్రమాదాలు జరగకుండా చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకో వడం ద్వారా పెను ప్రమాదాలు నివారించ వచ్చని సహాయ జిల్లా అగ్నిమాపక శాఖాధి కారి కె.శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని సూర్య రెసిడెన్సీ అపార్టుమెం టులో ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లపై డెమో నిర్వహించి అవగాహన కలిగించారు. అనం తరం అగ్నిప్రమాదాల సమయంలో తీసుకో వలసిన జాగ్రత్తలపై అవగాహన కలిగించారు. 

తాడేపల్లిగూడెం రూరల్‌: అగ్నిప్రమాదాల  పట్ల అపార్ట్‌మెంట్‌ల వాసులు జాగ్రత్తగా ఉండాలని తాడే పల్లిగూడెం అగ్నిమాపక అధికారి జి.వెంకట రామారావు సూచించారు. తాడేపల్లిగూడెం పట్టణంలోని అపార్ట్‌మెం ట్‌ల వద్ద అగ్నిమాపక శాఖ వారోత్సవాల సందర్భంగా కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అపార్ట్‌మెంట్‌ల వద్ద డెమో నిర్వహించారు. 


Updated Date - 2021-04-17T05:04:41+05:30 IST