కొండెక్కనున్న ఉల్లి?

ABN , First Publish Date - 2022-09-17T04:52:02+05:30 IST

ఉల్లి ధరకు డేంజర్‌ బెల్స్‌ మోగనున్నాయి.

కొండెక్కనున్న ఉల్లి?

కర్నూలు నుంచి మందగించిన దిగుమతులు
మహారాష్ట్ర ఉల్లిపైనే ఆధారం..
ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టకుంటే ధరలకు రెక్కలు


తాడేపల్లిగూడెం రూరల్‌, సెప్టెం బరు 16 :ఉల్లి ధరకు డేంజర్‌ బెల్స్‌ మోగనున్నాయి. ఉల్లి దిగు మతులు రోజు రోజూకు మందగిస్తుండడంతో వ్యాపారులు జాగ్రత్త పడుతున్నారు. కర్నూల్‌ ఉల్లి దిగుమతులు మందగిం చడం, ఆ ఉల్లిని ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు పెరగడం, మహారాష్ట్ర ఉల్లి పంటపై వర్షాల ప్రభావం తదితర కారణాలతో ఉల్లి ధరకు రెక్కలు రావడం ఖాయంగా కనిపి స్తోంది. ప్రస్తుతం ఉల్లి ధర కొంత సాను కూలం గానే ఉన్నా రాబోయే రోజుల్లో ఉల్లి ఘాటెక్కడం పక్కా అంటూ వ్యాపారులు పేర్కొంటున్నారు.
తాడేపల్లిగూడెంలో హోల్‌సేల్‌ మార్కెట్‌లో నాణ్యతను బట్టి కిలో ఉల్లి రూ.18 గరిష్ఠం కాగా అందులోనే రెండో రకం రూ.14–రూ15లకు విక్రయి స్తున్నారు. మహారాష్ట్ర ఉల్లి కిలో రూ.10 నుంచి నాణ్యతను బట్టి రూ.6 వరకూ కనిష్ఠంగా విక్రయి స్తున్నారు. రాబోయే రోజుల్లో దిగుమతులు మంద గించే అవకాశాలు కనిపిస్తుండడంతో ప్రస్తుతం నిలకడగా ఉన్న ఉల్లిధర దసరా తర్వాత కొండె క్కడం ఖాయంగా కనిపిస్తోంది.

దిగుమతులు అంతంతే..
సాధారణంగా ఈ రోజుల్లో ఉల్లి దిగుమతులు కర్నూలు నుంచి రోజుకు కనీసం 60 లారీల సరు కైనా దిగేది. ప్రస్తుతం కర్నూలు ఉల్లికి తాడేపల్లి గూడెం మార్కెట్‌లో సరైన ధర రాకపోవడం, దిగుబడులు తగ్గడం, బెంగళూరు ప్రాంతానికి భారీగా ఎగుమతులు చేస్తుండడంతో దిగుమతి తగ్గింది. దీంతో మార్కెట్‌ మహారాష్ట్ర ఉల్లిపై ఆధారపడడంతో అక్కడ నుంచి కూడా రోజుకు 10 లారీలకు మించి సరుకు రావడం లేదు. ప్రభు త్వం ముందుగానే ఉల్లి ధర నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటే గతంలో మాదిరిగా కేజీ ఉల్లి రూ.50కి పైగా విక్రయించే ప్రమాదం నుంచి సామాన్యులకు కాపాడవచ్చని, వ్యాపారులను కట్టడి చేసే నియంత్రణ చర్యలు చేపట్టడం, ఎగుమతులపై నిషేధం తదితర ముందస్తు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ధరపై నియంత్రణ ఉండాలి..
ఉల్లి ధర  పెరగడానికి కారణం ఒక పక్క వ్యాపారులు, మరో పక్క ప్రభుత్వం. అదను చూసుకుని వ్యాపారులు ఉల్లిని బ్లాక్‌ చేస్తూ క్యాష్‌ చేసుకోవాలనే చూస్తారు.  ప్రభుత్వం ఉల్లిపాయల మార్కెట్‌ పై నియంత్రణ పెట్టి అవసరమైతే తనిఖీలు చేసి ఉల్లి ధరలు పెరగ కుండా చర్యలు తీసుకోవాలి.
– కోనాల వెంకటేశ్వరరావు, తాడేపల్లిగూడెం

ఎగుమతులను నిషేధించాలి..
ఉల్లిపాయలు ప్రస్తుతం అందుబాటులోనే ఉన్నా రాబోయే రోజుల్లో ఉల్లి ధరలు పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. మాలాంటి చిరు వ్యాపారులకు ఉల్లి ధర పెరిగినా తగ్గినా పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఉల్లి ధరలు నియం త్రించేందుకు ఎగుమతులను నిషేధిస్తే ధరలు అందుబాటులో ఉంటాయి.  
పి.సుబ్బారావు, తాడేపల్లిగూడెం,చిరు వ్యాపారి  

Updated Date - 2022-09-17T04:52:02+05:30 IST