పేరుపాలెం బీచ్‌కు కొట్టుకొచ్చిన 200 కిలోల తూర చేప
మొగల్తూరు, మే 19 : పేరుపాలెం సాగర తీరానికి గురువారం భారీ తూర చేప కొట్టుకొచ్చింది. రెండు రోజులుగా సముద్ర కెరటాల ఉధృతి ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే సుమారు 200 కిలోలు పైబడి బరువు ఉన్న తూర చేప కొట్టుకొచ్చింది. సముద్రంలో పెద్ద చేపల దాడి చేయడం లేదా ఓడల కిందిభాగం తగిలి చనిపోయి ఉండవచ్చని మత్స్యకారులు అభిప్రాయ పడుతు న్నారు. ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.