ఒక్కరోజే 12 మంది మృతి..

ABN , First Publish Date - 2021-05-11T05:33:36+05:30 IST

పగటి కర్ఫ్యూ, మినీ లాక్‌ డౌన్‌ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న ఫలితంగా జిల్లాలో సోమవారం కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు కాస్తంత తగ్గు ముఖం పట్టాయని ఆరోగ్యశాఖ వర్గాలు ప్రాథమిక అంచనా వేస్తోంది.

ఒక్కరోజే 12 మంది మృతి..

ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 10: పగటి కర్ఫ్యూ, మినీ లాక్‌ డౌన్‌ నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేస్తున్న ఫలితంగా జిల్లాలో సోమవారం కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు కాస్తంత తగ్గు ముఖం పట్టాయని ఆరోగ్యశాఖ వర్గాలు ప్రాథమిక అంచనా వేస్తోంది. వారాంతపు రోజున వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌ను రసాయ నాలతో శుభ్రపరచడానికి ఆదివారం మూసివేయడం వల్ల స్వా బ్‌లను పూర్తిస్థాయిలో పరీక్షించే అవకాశం లేకపోవడం మరో కారణం కావచ్చు. సోమవారం సాయంత్రానికి వెల్లడైన కొవిడ్‌ టెస్టుల ఫలితాల్లో 423 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా, 12 మంది మృతి చెందడం కలవరం పుట్టిస్తోంది. తాజా కేసులతో కొత్తగా 66 కంటైన్మెంట్‌ జోన్‌లు ఏర్పాటు కానున్నాయి. మరో 4–5 రోజుల వరకు కొవిడ్‌ కేసుల నమోదు, గణాంకాలను విశ్లే షించిన తరువాతే పగటి కర్ఫ్యూ, మినీ లాక్‌డౌన్‌ ఫలితాలపై తుది అంచనాకు వచ్చే రావచ్చు. 


సాంకేతిక పనులకు వద్దు

కొవిడ్‌ ఆసుపత్రులు, కేర్‌ సెంటర్లలో వైద్య సేవల నిమిత్తం తాత్కాలిక ప్రాతిపదిక నియమితులైన వైద్యులు, స్టాఫ్‌ నర్సు లు, ఏఎన్‌ఎంలు, ఎంఎన్‌వోలు, ఎఫ్‌ఎన్‌వోలను నిర్దేశిత సేవల కు కాకుండా ఫోన్‌ కాల్‌ డ్యూటీలకు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ విధులకు వినియోగించుకోరాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కొవిడ్‌ నివారణ వైద్య సేవలకు సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నందున డీఎంహెచ్‌వోలు ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. జిల్లాలో కొవిడ్‌ సేవలకు నియమితులైన తాత్కా లిక సిబ్బందిలో దాదాపు 50 మందికిపైగా అనధికారికంగా లేదా డిప్యూటేషన్లపై ఫోన్‌కాల్‌ డ్యూటీలకు, డేటా ఎంట్రీ ఆప రేటర్‌ విధులకు ఇప్పటికీ వినియోగిస్తున్నారు. ఫలితంగా కొవిడ్‌ బాధితులకు వైద్య సేవలందించడానికి సిబ్బంది కొరత కొనసాగుతూనే ఉంది. 

Updated Date - 2021-05-11T05:33:36+05:30 IST