గ్రామాల్లో శరవేగంగా వైరస్‌ వ్యాప్తి

ABN , First Publish Date - 2021-05-06T05:04:11+05:30 IST

మండలంలోని పలు గ్రామాల్లో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది.

గ్రామాల్లో శరవేగంగా వైరస్‌ వ్యాప్తి
మాదేపల్లిలో శానిటేషన్‌ పనులు నిర్వహణ

ఏలూరు రూరల్‌ మండలంలో 25 పాజిటివ్‌ కేసులు

ఏలూరు రూరల్‌, మే 5 : మండలంలోని పలు గ్రామాల్లో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. ఏ వీధి చూసినా కరోనాబారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ గణనీయంగా పెరుగుతోంది. మరణాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వ్యాధి బారినపడిన నాలుగైదు రోజుల్లోనే ఆరోగ్యం పూర్తిగా క్షీణించి ఆస్పత్రుల పాలవుతున్నారు. వ్యాధి లక్షణాలతో ఉన్న వ్యక్తులు కొవిడ్‌ పరీక్షలు చేయించు కున్నా ఫలితాల్లో తీవ్ర జాప్యం నెలకొనడం వల్ల వ్యాధి తీవ్ర పెరిగిపోతోంది. మండలంలోని పలు గ్రామాలను హాట్‌స్పాట్‌లుగా గుర్తించారు. రోజుకు 20 మందికి పైగా కొవిడ్‌ బారిన పడుతుండడంతో గ్రామస్థుల్లో తీవ్ర భయాందోళ నలు నెలకొన్నాయి. మండలంలో బుధవారం 25 పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. కేసులు నమోదైన ప్రాంతాల్లో రెడ్‌జోన్‌ ప్రకటించి ఆంక్షలు అమలు చేస్తున్నారు.  మండలంలో ఇప్పటి వరకూ 500 కేసులు పైగా నమోదయ్యాయి. 


 పెదపాడు మండలంలో 18 కేసులు

పెదపాడు, మే 5 :పెదపాడు పీహెచ్‌సీ పరిధిలో వసంతవాడ, పెదపాడు, కొత్తముప్పర్రు గ్రామాల్లో రెండేసి, నాయుడుగూడెం, గుడిపాడులో ఒక్కొక్కటి చొప్పున పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. వట్లూరు పీహెచ్‌సీ పరిధిలో వట్లూరులో 5, ఏపూరులో 5 పాజిటివ్‌ కేసులు నమోద య్యాయి. పెదపాడులో 250 మందికి, వట్లూరులో 180 మందికి సెకండ్‌ డోస్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియను నిర్వహించారు. 


జూట్‌మిల్లుకు మినహాయింపు 

ఏలూరు టూటౌన్‌, మే 5: కర్ఫ్యూ నుంచి ఉత్పాదక పరిశ్రమలకు మినహా యింపును ప్రభుత్వం ఇచ్చిందని ఏలూరు జూట్‌మిల్‌ ఐఎన్‌టీ యూసీ అధ్యక్షుడు పులి శ్రీరాములు తెలిపారు. ఏలూరు జూట్‌మిల్లుకు ఈ మినహా యింపు వర్తిస్తుందన్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకూ షిఫ్టులు వారీగా జూట్‌మిల్లు పని చేస్తుందన్నారు. కార్మికులందరికి గుర్తింపు కార్డులు జారీ చేశారన్నారు. 

Updated Date - 2021-05-06T05:04:11+05:30 IST