బాపూ ఆశయ సాధనకు..

ABN , First Publish Date - 2022-08-09T06:16:57+05:30 IST

జాతిపిత మహాత్మా గాంధీ దేశ ప్రజలందరినీ అసహాయో ద్యమంలో భాగంగా త్రివిధ బహిష్కరణల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

బాపూ ఆశయ సాధనకు..
గాంధీ ఆంధ్రా జాతీయ విద్యాలయం

ఏలూరులో గాంధీ ఆంరఽధా జాతీయ విద్యాలయం ఏర్పాటు
ఏలూరుసిటీ, ఆగస్టు 8: జాతిపిత మహాత్మా గాంధీ దేశ ప్రజలందరినీ అసహాయో ద్యమంలో భాగంగా త్రివిధ బహిష్కరణల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇందులో ఒకటైన పాఠశాలల బహిష్కర ణతో వేలాది మంది విద్యార్థులు చదువులకు స్వస్తి పలికారు. దీంతో అప్పట్లో విద్యాభ్యాసం కొనసాగించడమనే సమస్య కొత్తగా ఉద్భవించింది. ఈ సమస్య పరిష్కరిం చేందుకు దేశమంతటా జాతీయ విద్యాలయాలు నెలకొల్పాలని అప్పటికప్పుడు గాంధీజీ సంకల్పించారు. గాంధీజీ ఆదేశానుసారమే ఏలూరులో జాతీయ విద్యాలయం ప్రారంభించబడింది. ఫలితంగా పశ్చిమగోదావరి జిల్లా స్వాతంత్రోద్యమ చరిత్రలోనే గాక ఆంధ్రప్రదేశ్‌లో విశిష్ట స్థానం పొందింది. ఈ విద్యాలయం స్థాపించాలనే ఉద్దేశంతో మానేపల్లి సూర్యనారాయణ, తమ్మన మాణిక్యం, పశుమర్తి పురుషోత్తం, కంభంపాటి కన్నయ్య దీక్షా సంఘంగా ఏర్పడి లక్ష రూపాయలు వసూలు అయ్యే వరకు సభ్యులెవరూ తమ ఇళ్లకు వెళ్లరాదని దీక్ష వహించారు. ఆ రోజుల్లో ఏలూరులో ప్రారం భించబడే ఏ సత్కార్యానికైనా నాయకత్వం వహిస్తూ ఉండే మోతే గంగరాజు జమీందార్‌ను దీక్షా సంఘం అఽధ్యక్షుడిగా నియమించుకున్నారు. అప్పట్లో ఏలూరు జనాభా 60 వేలు మాత్రమే. దీక్షా సంఘం వారు ఎంతో శ్రమించి 67 వేల రూపాయలు వసూలు చేశారు. ఈ నేపథ్యంలో 1921ఏప్రిల్‌లో బెజవాడలో అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశం జరుగుతుందన్న వార్త విని ఆ సందర్భంలో ఎలాగైనా గాంధీజీ చేతుల మీదుగా ఈ విద్యాలయం స్థాపన జరిపించాలని దీక్షా సంఘం వారు అనుకున్నారు. వారి కోరిక మేరకు 3–4–1921లో గాంఽధీజీ కస్తూర్బాతో కలిసి ఈ విద్యాలయం ప్రారంభించారు. ఆనాటి నుంచే ఈ విద్యాలయానికి గాంధీ ఆంరఽధా జాతీయ విద్యాలయంగా నామకరణం చేశారు. 1921 జూలై 1న తిలక్‌ స్వరాజ్య నిధి వసూలు నిమిత్తం ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు, ఆంరఽధరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, తదితరులు ఏలూరు వచ్చారు. అప్పటికే విద్యాలయం ఏర్పాటుకు రూ. 67 వేలు వసూలు కాగా వాగ్దానములలో రూ.18 వేలు కలిపితే మొత్తం రూ. 85 వేలు వసూలయ్యింది. మిగిలిన సొమ్ము రూ. 15 వేలను కాం గ్రెస్‌ సంఘం నుంచి దీక్షా సంఘం వారికి ఇచ్చారు. దీంతో దీక్షా సం ఘం వారు రూ. లక్ష నిధిని స్వరాజ్య నిధికి జమకట్టారు. ఆ విధంగా 20–12–1921న ములుకూరి గవరయ్య మేడలో విద్యాలయ ప్రారం భోత్సవం జరిగింది. ఆనాడు జనార్దన స్వామి ఆలయం నుంచి పెద్ద ఊరేగింపు నిర్వహించారు. ఆ సందర్భంలో పాఠశాలకు మరో 1000 రూపాయల నిధులు జమ కాగా, కలగర రామస్వామి 15 సెంట్ల భూమిని విరాళంగా ఇచ్చారు. మొదట 44 మంది విద్యార్థులు చేరారు. విద్యార్ధుల సంఖ్య క్రమంగా పెరటంతో 27–5–22లో విద్యాలయం దాసువారితోట స్థలానికి మార్చారు. ఆ తరువాత ఆ స్థలంలో కొన్ని పక్కా కట్టడాలు, తాత్కాలిక వసతి గృహాలు నిర్మించారు. ఈ మహా విద్యాలయానికి పప్పు పార్వతీశం మొదటి ఆచార్యునిగా నియమించబడ్డారు. ఇతను ఇంగ్లాండ్‌, స్కాట్లాండ్‌ దేశాలలో బోధనా పద్ధతుల్లో ఉత్తీర్ణులైన ధీశాలి. ఈయన అధ్యక్షతన విద్యాలయం త్వరి తగతిన అభివృద్ధి చెందుతూ 200 మంది విద్యార్థులు 11 మంది ఉపాధ్యాయులతో కళకళలాడేది. మాతృభాషలోనే విద్యాబోధన జరిగేది. తర్వాత చరిత్ర, భూగోళము, ప్రకృతిశాస్త్రం, చిత్రలేఖనం, తెలుగు, హిందీ ఉర్దూ, సంస్కృతం , ఇంగ్లీషు, ఆయుర్వేదం, నూలు వడకుట, బట్టలు నేత, అచ్చుపని మొదలగు సబ్జెక్టులు బోధించేవారు. అయితే 1932లో గాంధీ ఇర్విన్‌ సంధి భగ్నమై గాంఽధీజీ సత్యాగ్రహోద్యమం తిరిగి ప్రారం భించినప్పుడు చాలామంది స్థానిక నేతలు ఈ విద్యాలయం నుంచే అరెస్టు చేయబడి శిక్షించబడ్డారు. చివరి చర్యగా పోలీసులు ఈ శిబి రంపై పెద్దఎత్తున దాడి చేసి, శిబిరంలో ఉన్న వారందరినీ లాఠీచార్జి చేసి అరెస్టు చేయడంతోపాటు విద్యాలయాన్ని మూసివేశారు. 1934లో గాంధీజీ ఉద్యమం విరమించిన తర్వాత ప్రభుత్వం విద్యాలయ భవనాలను తిరిగి ఇచ్చి వేయటంతో విద్యాలయం మరలా ప్రారంభించారు. 1936 సంవత్సరంలో ఐదుగురు ఉపాధ్యాయులు, 110 మంది విద్యార్థులతో తిరిగి ఈ విద్యాలయం కొనసాగింది. ఆ విధంగా విద్యాలయం ప్రముఖ పాత్ర వహించిందని చరిత్ర చెబుతోంది. నేటికీ స్వాతంత్రోద్యమ తీపి గుర్తు అందిస్తూ విద్యాలయం కొనసాగుతోంది. 75 ఏళ్ల స్వాతంత్య్ర స్వర్ణోత్సవాల్లో ఈ విద్యాలయ చరిత్రను మళ్లీ మనం ఒకసారి స్మరించుకుందాం.

Updated Date - 2022-08-09T06:16:57+05:30 IST