నల్లబ్యాడ్జీలు ధరించి వీఆర్వోల నిరసన

ABN , First Publish Date - 2021-12-03T05:31:49+05:30 IST

శ్రీకాకుళం జిల్లా పలాసలో మునిసిపల్‌ కమిష నర్‌, మంత్రి సిరిది అప్పలరాజు వీఆర్వోల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పెదపాడు మండల వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో వీఆర్వోలు నల్ల బ్యాడ్జీలు ధరించి తహసీల్దారు కార్యాలయం ఎదుట గురువారం నిరసన తెలిపా రు.

నల్లబ్యాడ్జీలు ధరించి వీఆర్వోల నిరసన
పెదపాడులో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్న వీఆర్వోలు

పెదపాడు, డిసెంబరు 2 : శ్రీకాకుళం జిల్లా పలాసలో మునిసిపల్‌ కమిష నర్‌, మంత్రి సిరిది అప్పలరాజు వీఆర్వోల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పెదపాడు మండల వీఆర్వోల సంఘం ఆధ్వర్యంలో వీఆర్వోలు నల్ల బ్యాడ్జీలు ధరించి తహసీల్దారు కార్యాలయం ఎదుట గురువారం నిరసన తెలిపా రు. రాష్ట్ర వీఆర్వోల సంఘం పిలుపు మేరకు నల్లబ్యాడ్జీలతో నిరసన చేపట్టా మని, తక్షణం వీఆర్వోలకు క్షమాపణ చెప్పాలని లేకుంటే రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని జిల్లా వీఆర్వోల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.ఎ.ఎస్‌.ఆర్‌. రాంబాబు తెలిపారు. రాత్రి, పగలు లేకుండా విధులు నిర్వహిస్తున్న వీఆర్వోలను బాధించడం తగదని మండల వీఆర్వోల సంఘం అధ్యక్షుడు బేవర కోటేశ్వరరావు అన్నారు. కార్యక్రమంలో వీఆర్వోలు నటరాజన్‌ దాస్‌, కరీముల్లా, వెంకటేశ్వరరావు, అజయ్‌, మురళీ తదితరులు పాల్గొన్నారు.

పెదవేగి : వీఆర్వోల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా  మండ లంలోని వీఆర్వోలు నల్లబ్యాడ్జీలు ధరించి తహసీల్దారు కార్యాలయం వద్ద గురు వారం నిరసన తెలిపారు. మండల వీఆర్వోల సంఘం అధ్యక్షుడు వి.శ్రీనివాస్‌, పలువురు వీఆర్వోలు పాల్గొన్నారు.  

Updated Date - 2021-12-03T05:31:49+05:30 IST