కిట్లతో ఇక్కట్లు

ABN , First Publish Date - 2021-05-16T05:35:11+05:30 IST

జిల్లాలో విద్యాకానుక కిట్ల పంపిణీ వివాదాస్పద మైంది.

కిట్లతో ఇక్కట్లు

బహిష్కరణకు హెచ్‌ఎంల సంఘ అల్టిమేటం

స్వీకరించాల్సిందేనంటున్న జిల్లా విద్యాశాఖ


ఏలూరు ఎడ్యుకేషన్‌, మే 15 : జిల్లాలో విద్యాకానుక కిట్ల పంపిణీ వివాదాస్పద మైంది. నూతన విద్యా సంవత్సరం (2021– 22)లో మొత్తం 3 లక్షల 31 వేల 887 మంది బాలబాలికలకు పాఠశాలలు తెరిచే నాటికి సరఫరా చేయాలన్న లక్ష్యంతో దశల వారీగా అన్ని మండలాల్లో ఎంపిక చేసిన స్కూలు కాంప్లెక్స్‌ (క్లస్టర్‌)లకు కిట్ల పంపిణీ ప్రారంభ మైంది. అయితే స్కూలు కాంప్లెక్స్‌లలో దిగు మతి చేస్తోన్న విద్యా కానుక కిట్లను భద్రపరి చేందుకు పాఠశాలల్లో నైట్‌ వాచ్‌మెన్‌లు లేకపోవడం, బోధనేతర సిబ్బంది లేకపో వడం, చెదలు, క్రిమి కీటకాలు, ఎలుకల బారి నుంచి కిట్లను కాపాడడం హెచ్‌ఎంలకు శక్తికి మించిన పని అని ప్రధానోపాధ్యాయుల సంఘం అభ్యంతరం చెబుతోంది. పరిస్థితులు చక్కబడిన తరువాతే కిట్లను పాఠశాలలకు సరఫరా చేయాలని, లేదంటే కిట్ల స్వీకరణను బహిష్కరిస్తామని సంఘ నాయకులు జిల్లా విద్యాశాఖకు అల్టిమేటం ఇచ్చారు. హెచ్‌ఎంల అభ్యంతరాలకు ధీటుగా స్పందించిన జిల్లా విద్యాశాఖ కిట్లను స్వీకరించబోమని హెచ్‌ ఎంలు లిఖిత పూర్వకంగా తిరస్కరణ లేఖలు ఇవ్వాలని షరతు పెట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలో విద్యా కానుక కిట్ల పంపిణీ ఒడిదుడుకుల మధ్య జరుగుతోంది.


వాయిదాకు హెచ్‌ఎంల డిమాండ్‌ 

కరోనా సెకండ్‌ వేవ్‌లో పలువురు ప్రధానో పాధ్యాయులు, టీచర్లు ప్రాణాలు కోల్పోవడం, అనారోగ్యం పాలవడం జరుగుతోందని ప్రధా నోపాధ్యాయుల సంఘం జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి.వి.రమణ,  శ్రీమన్నా రాయణ తదితరులు ఆందోళన వ్యక్తం చేశారు. పలు స్కూలు కాంప్లెక్స్‌లలో వస తులు లేక హెచ్‌ఎంలు తీవ్రమైన మానసిక క్షోభ అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తు తం పగటి కర్ఫ్యూ అమలులో ఉన్నందున కిట్లను స్వీకరించేందుకు పాఠశాలలకు రాక పోకలు సాగించడంలో హెచ్‌ ఎంలకు పలు ఇబ్బందులు ఎదురవు తున్నాయని వివరిం చారు. ఈ నేపథ్యంలో కిట్లను స్కూలు కాంప్లె క్స్‌లకు సరఫరా చేయడాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి, పరిస్థితులు చక్కబడిన తరువాతే పంపిణీ చేయాలని డీఈవో రేణుకకు వినతిపత్రం అందజేశారు. అలాకాని పక్షంలో కిట్ల స్వీకరణ బహిష్కరించడం మినహా మరో మార్గంలేదని తేల్చిచెప్పారు.


ఎక్కడా ఆటంకాలు లేవు : విద్యాశాఖ

విద్యా కానుక కిట్లను రవాణా చేసే వాహ నాలను రహదారులపై పోలీసులు అడ్డుకో కుండా ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా విద్యాశాఖ వర్గాలు వెల్లడిం చాయి. స్కూలు కాంప్లెక్స్‌లలో దిగుమతి చేసే కిట్ల పర్యవేక్షణ బాధ్యత సీఆర్పీలపై కూడా ఉంటుందని వివరించాయి. పాఠశాలలు తెరిచే నాటికి విద్యార్థులందరికీ కిట్‌లు అందే లా చూడాలంటే తొలుత స్కూలు కాంప్లెక్స్‌ లకు సకాలంలో వాటిని చేర్చాల్సి ఉంటుందని తెలిపాయి. కిట్‌లు తీసుకు నేందుకు హెచ్‌ ఎంలు నిరాకరిస్తే  లిఖిత పూర్వకంగా తెలియజేయాలని జిల్లాలో ఇప్పటివరకు ఎక్కడా అభ్యంతరాలు రాలేదని వివరించారు. 

Updated Date - 2021-05-16T05:35:11+05:30 IST