మట్టిలో కలిసిపోవాల్సిందేనా..!

ABN , First Publish Date - 2021-04-17T05:08:17+05:30 IST

జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలోని జీపులు శిథిలమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు.

మట్టిలో కలిసిపోవాల్సిందేనా..!
ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో..

ఏలూరు కార్పొరేషన్‌, ఏప్రిల్‌ 16: జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలోని జీపులు శిథిలమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో ఒక జీపు ఎండకు ఎండి వానకు తడిసి శిథి లావస్థకు చేరుకుంటోంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం జడ్పీ ఆవరణలో చెట్టు కింద మరో జీపు నిరుపయోగంగా ఉంది. ఈ జీపులను అధికారులు పట్టించుకోక పోవడంతో అవికాస్తా ఎండకు ఎండి, వానకు తడిసి శిథిలా వస్థకు చేరుకుంటున్నాయి. ఈ జీపులకు మరమ్మతులు నిర్వహించి వినియో గంలోకి తీసుకొస్తే ప్రభుత్వానికి అద్దె జీపుల్లో తిరిగే అద్దెభారం తగ్గడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించుకున్నట్టు అవుతుంది. ఈ విషయమై గ్రామీణ నీటి సరఫరా విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎ.జి.రామా రావును వివరణ కోరగా ఆ జీపులు పనికిరావని, వాటిని తొలగించాలని ప్రభు త్వం ఆదేశించిందని, ఉన్నతాధికారులు ఆదేశిస్తే వాటిని బహిరంగ వేలం వేస్తామని స్పష్టం చేశారు.  



Updated Date - 2021-04-17T05:08:17+05:30 IST