ముంచెత్తింది

ABN , First Publish Date - 2022-07-02T06:14:21+05:30 IST

జిల్లాలో తీరం తో పాటు పలు ప్రాంతాల్లో శుక్రవారం భారీ వర్షం కురిసిం ది.

ముంచెత్తింది
నీటమునిగిన నరసాపురం మెయిన్‌ రోడ్డు

తీరంలో భారీ వర్షం.. పల్లపు ప్రాంతాలు జలమయం
నీటమునిగిన నారుమళ్లు.. ఆందోళనలో రైతులు

నరసాపురం టౌన్‌/ యల మంచిలి/ పెనుమంట్ర/ మొగ ల్తూరు, జూలై 1: జిల్లాలో తీరం తో పాటు పలు ప్రాంతాల్లో  శుక్రవారం భారీ వర్షం కురిసిం ది. మూడు గంటల పాటు పడి న వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పంట పొలాలు చెరువుల్ని తలపించాయి. నరసాపురంలోని స్టీమర్‌, మెయిన్‌ రోడ్డులతో పాటు రైల్వే స్టేషన్‌, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయాలు, పొన్నపల్లి, నందమూరి కాలనీ తదితర ప్రాంతాల్లో రోడ్లు మోకాల లోతు నీట మునిగాయి. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని కనకదుర్గ ఆలయం సగం వరకు మునిగిపోయింది. భక్తులు నీటిలోనే నిలబడి పూజలు చేశా రు. వర్షం తగ్గినా ఎగువ ప్రాంతం నుంచి డ్రెయిన్లు పొంగి పొర్లుతుండడంతో మధ్యాహ్నం వరకు ఇదే పరిస్థితి ఉంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పలు గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. యలమంచిలి మండలంలోని గ్రామాల్లో గురువారం అర్థరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకూ భారీ వర్షం కురవడంతో వరి నారుమడులు నీట మునిగాయి. వారం రోజులుగా ప్రతిరోజూ వర్షం కురవడంతో నారు మళ్లలోని నీటిని బయటకు తోడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. డీజిల్‌ రేటు అధి కంగా ఉండడంతో  ఇంజన్ల ఖర్చు భరించలేక కారెం ఉపయోగించి నీటిని తోడు తున్నామని పలువురు రైతులు చెబుతున్నారు.   పెనుమంట్ర మండలంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షలకు పల్లపు ప్రాంతాలు జలమయం అయ్యాయి. మండలంలో 31.2 మిల్లిమీటర్ల వర్షంపాతం నమోదు అయింది. ఆలమూరు, నెలమూరు, పొలమూరు, నేలమూరు, ఓడూరు గ్రామాల్లో డ్రెయినేజీలు పొంగి నీరు బయటకు రావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. పొలమూరులో అంబేడ్కర్‌ నగర్‌, పితాని సత్యనారా యణ కాలనీ, కేపీఆర్‌, వర్మ కాలనీల్లో నీరు నిలిచింది. మొగల్తూరు మండలంలో పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు సుమారు 52.2 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదైంది. మొగల్తూరు పంచాయతీ కొత్తకాయలతిప్ప గ్రామంలో ఇళ్ల మధ్య నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. మొగల్తూరు– భీమవరం ప్రధాన రహదారిలో పెద్ద గొల్లగూడెం, మసీదు రోడ్డు, గాంధీబొమ్మల సెంటర్‌, పాతకాల్వ తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారుల్లో నీరు నిలిచిపోయింది.  

Updated Date - 2022-07-02T06:14:21+05:30 IST