సచివాలయ పరిధిలోకి ఉపాధి పథకం

ABN , First Publish Date - 2021-10-18T04:49:46+05:30 IST

ఉపాధి హామీ పథకం సచివాలయ పరిధి లోకి రానుంది.

సచివాలయ పరిధిలోకి ఉపాధి పథకం

ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు ప్రత్యేక గది

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఏలూరు రూరల్‌, అక్టోబరు17 : ఉపాధి హామీ పథకం సచివాలయ పరిధి లోకి రానుంది. గ్రామ స్థాయిలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌ సచివాలయాల నుంచి విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఇటీవల ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. సచివాలయాల్లో ఒక గదిని కేటాయించాలని, లేనిచోట తక్షణం నిర్మించాలని సూచించారు. అందుకు అవసర మైన చర్యలు చేపట్టాలని డ్వామా పీడీని ఆదేశించారు. ఇప్పటివరకూ మండల అధికారుల పర్యవేక్షణలో పనిచేసిన ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లు ఇక నుంచి పంచాయతీ కార్యదర్శుల పరిధిలో పని చేయాలని సూచించారు. ఉపాధి హామీ పథకం కాంపోనెంట్‌ నిధులతో సచివాలయాలు, ఆర్‌బీకే నిర్మిస్తున్నారు. పథకా నికి సంబంధించిన రికార్డులు, విలువైన పత్రాలు మండల కేంద్రాల్లోనే ఉన్నాయి. అయితే ఇటీవల కేంద్ర బృందం పర్యటన చేపట్టిన క్రమంలో రికార్డులు ఇక్కడ నుంచి రావడాన్ని గుర్తిం చారు. గ్రామ స్థాయిలో ఉపాధి హామీ పథకానికి ఒక కార్యాలయం ఉండాలని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. ఈ క్రమంలో సచివాలయాల్లో ఒక గదిని కేటాయించాలని ఆదేశించారు. ఏలూరు మండలంలో 22 పంచాయతీలు ఉన్నాయి. తాజాగా ఏలూరు నియోజకవర్గంలోని ఏడు పం చాయతీలు, ఏలూరు కార్పొరేషన్‌లో విలీనం చేశారు. ఇక దెందులూరు నియో జకవర్గంలో ఏలూరు మండలంలోని 15 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఉన్న సచివాలయాల్లో గదులు కేటాయింపుపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నా రు. ఇప్పటికే సచివాలయాల్లో 11 శాఖలకు సంబంధించి సహాయ కార్యదర్శులు పని చేస్తున్నారు. ఇరుకు గదులు కావడంతో సర్దుబాటు చేసుకుని విధులు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్‌కు ప్రత్యేక గది కేటాయింపు అంటే కష్టమేనని అధికారులు భావిస్తున్నారు. 


రాజకీయ జోక్యం పెరిగే అవకాశం

ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను పంచాయతీ కార్యదర్శి పరిధిలోకి తేవడంతో రాజకీయ జోక్యం జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకూ వేతనదారుల గుర్తింపు, జాబ్‌కార్డు ల జారీ ప్రక్రియ కాస్త పారదర్శకంగా చేపట్టేవారు. పథకాన్ని రాజకీయాలకు అతీతంగా అమలు చేసేవారు. అయితే ఇక నుంచి సచివాలయం నుంచే విధు లు నిర్వహించాలని ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో గ్రామ సర్పంచ్‌లు ప్రతి అం శంలో తల దూర్చే అవకాశం ఉంది. ఉపాధి పనుల విషయంలో వారు తమ సిఫార్సులకు పెద్ద పీఠ వేయాలని ఫీల్డ్‌ అసిస్టెంట్లపై ఒత్తిడి పెంచే అవకాశాలు ఉన్నాయి.  

Updated Date - 2021-10-18T04:49:46+05:30 IST