Abn logo
Apr 12 2021 @ 23:30PM

ఘనంగా ఉగాది వేడుకలు

పెదపాడు, ఏప్రిల్‌ 12 : తెలుగు కొత్త సంవత్సరాది ఉగాది వేడుకలు విద్యార్థుల ఉప్పొంగే హుషారు, సంప్రదాయ సోయగాల నడుమ సోమ వారం ఘనంగా జరిగాయి. వట్లూరులోని సర్‌ సీఆర్‌రెడ్డి ఇంజనీరింగ్‌ కళా శాల ఏంబీఏ విద్యార్థులు సోమవారం ప్లవ నామ సంవత్సరానికి స్వాగతం పలికారు. అచ్చమైన తెలుగు సంప్రదాయాన్ని గుర్తు తెచ్చేలా వేషధారణ లతో అలరించారు. ఉగాది పచ్చడిని అందరికీ అందజేశారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ జి.సాంబశివరావు, కరస్పాండెంట్‌ కొండా హరికృష్ణంరాజు, హెచ్‌వోడీ కేవీ శ్రీధర్‌, కో–ఆర్డినేటర్‌ వి.సందీప్‌ పాల్గొన్నారు. 

  ఉగాదికి ఆలయాలు ముస్తాబు

పెదపాడు, ఏప్రిల్‌ 12: తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాదిని పుర స్కరించుకుని మండలంలోని ఆలయాలు ముస్తాబవుతున్నాయి. అప్పన వీడులోని అభయాంజనేయ స్వామి దేవాలయంతో పాటుగా పెదపాడు, కలపర్రు, వట్లూరు తదితర గ్రామాల్లోని పలు దేవాలయాల్లో ఉగాది పం చాగ శ్రవణం, ఉగాది పచ్చడి పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఉగాదిని పుర స్కరించుకుని దేవాలయానికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపడుతున్నట్టు అభయాంజనేయస్వామి దేవాలయ ఈవో సతీష్‌కుమార్‌ తెలిపారు.

  నేడు దెందులూరులో ఉగాది గ్రామోత్సవం

దెందులూరు, ఏప్రిల్‌ 12: మండలంలోని దెందులూరులో మంగళవారం ఉగాది సందర్భంగా భారీ గ్రామోత్సవాన్ని (రామదండు) నిర్వహించనున్న ట్టు ఉగాది నిర్వహణ కమిటీ సభ్యుడు సుగ్గిశెట్టి నూకరాజు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి హనుమంతుడి జెండా, రామకోటి పుస్తకం, ఉగా ది విశేషాల వివరాలతో కూడిన పత్రికను అందిస్తార న్నారు. గ్రామంలోని తొమ్మిది మంది దేవతలకు పసుపు, కుంకుమ, బోనాలు సమ ర్పిస్తారన్నారు. హైస్కూల్‌ వద్ద దీపాలతో మహా హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారని, కరోనా నిబంధనలు పాటించేలా అన్ని చర్యలు తీసుకుంటు న్నామన్నారు. 

Advertisement
Advertisement
Advertisement