216 జాతీయ రహదారిపై .. టోల్‌ బాదుడు

ABN , First Publish Date - 2022-09-19T04:52:29+05:30 IST

తీరం వెంబడి కొత్తగా నిర్మించిన 216 జాతీయ రహదారి పనులు పూర్తి కావడంతో వాహనదారులు సంబర పడ్డారు.

216 జాతీయ రహదారిపై .. టోల్‌ బాదుడు
రాజుగారితోట వద్ద ఏర్పాటు చేస్తున్న టోల్‌ గేట్‌

 వచ్చే నెల నుంచి అమల్లోకి..
 నరసాపురం – విజయవాడల మధ్య మూడు ఏర్పాటు

నరసాపురం, సెప్టెంబరు 18: తీరం వెంబడి కొత్తగా నిర్మించిన  216 జాతీయ రహదారి పనులు  పూర్తి కావడంతో వాహనదారులు సంబర పడ్డారు. విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, చెన్నైలకు దగ్గర మార్గం ఏర్పడిం దని  భావించారు. అయితే వీరి ఆశలపై టోల్‌ ప్లాజాలు నీళ్లు చల్లనున్నా యి. ఈ రోడ్డు ఎక్కితే ఫాస్ట్‌ ట్రాక్‌ అకౌంట్‌ రీఛార్జీ చేసుకోవాల్సిం దే. ప్రతి 50 కిలోమీటర్ల దూరంలో ఒక టోల్‌గేట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. నరసా పురం– విజయవాడల మధ్య మూడు చోట్ల టోల్‌ పన్ను కట్టాల్సిందే.  
216 జాతీయ విస్తరణ పనులను 2014లో ప్రారంభించారు. తూర్పుగోదా వరి జిల్లా కత్తిపూడి నుంచి ఒంగోలు వరకు నిర్మించే 250 కిలోమీటర్ల కొత్త రహదారి వల్ల తూర్పు, పశ్చిమ, కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాలు అను సంధానంతో దగ్గర మార్గం ఏర్పడింది. ఇప్పటికే 80 శాతం పనులు పూర్త య్యాయి. జిల్లాలో చించినాడ నుంచి లోసరి వరకు 51 కిలోమీటర్ల మేర ప్రతిపాదించిన పనులు దాదాపు పూర్తయ్యాయి. ఈ కారణంగా విజయ వాడ, ఒంగోలుకు దగ్గర మార్గం ఏర్పడింది. అధికారికంగా ఈ మార్గం ఇంకా ప్రారంభించలేదు. అయితే కొంతకాలంగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. గతంలో నరసాపురం నుంచి విజయవాడ వెళ్లాలంటే భీమవరం లేదా ఏలూరు మీదుగా వెళ్లాల్సి వచ్చేది. ఈ రహదారి పూర్తికావడంతో కేవలం రెండున్నర గంటల్లో విజయవాడ చేరుకుంటున్నా రు. ఇటు అమలాపురం, రాజోలు ప్రాంత వాహనదారులు ఈ మార్గం మీదుగానే విజయవాడకు వెళ్లుతున్నారు. ఈ కొత్త రోడ్డు వల్ల దూరం, సమయం కలిసి వస్తుందని వాహనదారులు సంబరపడ్డారు. అయితే వీరి ఆశలకు టోల్‌ ప్లాజాలు నీళ్లు చల్లాయి. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక టోల్‌ ప్లాజాను ఏర్పాటు చేసిన పన్నులు వసూలు చేసేందుకు నేషనల్‌ హైవే విభాగం సన్నద్ధం అవుతోంది. దానిలో భాగంగా నరసాపురం మండలం రాజుగారితోట వద్ద టోల్‌ గేట్‌ ఏర్పాటు పనులు చకచక సాగుతున్నాయి. వచ్చే నెల నుంచి దీనిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

 మూడు చోట్ల పన్ను బాదుడు
ఈ కొత్త జాతీయ రహదారి ఏర్పాటు వల్ల నరసాపురం– విజయవాడల మధ్య దూరం 150 కిలోమీటర్ల మాత్రమే. ట్రాఫిక్‌ తక్కువగా ఉండడం వల్ల కారులో రెండున్నర గంటల వ్యవధిలో విజయవాడ వెళ్లిపోతున్నారు. అయితే వచ్చే నెల నుంచి మూడు చోట్ల టోల్‌గేట్‌లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడనుంది. వీటిలో నరసాపురం మండలం రాజుగారితోట, కృష్ణా జిల్లాలో బంటుమిల్లి– పెడన మధ్య మరొక్కటి , మూడోవది మచిలీపట్నం– విజయ వాడల మధ్య ఉండబోతున్నాయి. ఇక అమలాపురం, రాజోలు నుంచి వచ్చే వాహనదారులకు నాల్గొవ చోట్ల టోల్‌ప్లాజా పన్ను బాదుడు తప్పదు. చించి నాడ వంతెన దిగి తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించగానే టోల్‌ప్లాజా దర్శనమిస్తుంది. ఈ ప్లాజాల్లో కార్లు, లారీలు, బస్సులకు ఎంత పన్ను వసూలు చేయాలన్నది ఇంకా వెల్లడించలేదు.   

Updated Date - 2022-09-19T04:52:29+05:30 IST