విద్యాదీవెన కాదు.. విద్యార్థుల దగా దీవెన

ABN , First Publish Date - 2021-07-31T05:18:42+05:30 IST

ప్రభుత్వం విద్యాదీవెన పథకం విద్యా ర్థులకు దీవెనకరంగా లేదని విద్యార్థు లను దగా చేసేదిగా ఉందని తెలుగు నాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (టీఎన్‌ ఎస్‌ఎఫ్‌) ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు పెనుబోయిన మహేష్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు.

విద్యాదీవెన కాదు.. విద్యార్థుల దగా దీవెన
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు మహేష్‌

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ అధ్యక్షుడు మహేష్‌ ఎద్దేవా 

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, జూలై 30 : ప్రభుత్వం విద్యాదీవెన పథకం విద్యా ర్థులకు దీవెనకరంగా లేదని విద్యార్థు లను దగా చేసేదిగా ఉందని తెలుగు నాడు స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ (టీఎన్‌ ఎస్‌ఎఫ్‌) ఏలూరు పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు పెనుబోయిన మహేష్‌ యాదవ్‌  ఎద్దేవా చేశారు. ఏలూరు టీడీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్‌ మాట్లాడు తూ పీజీ విద్యార్థులకు జగనన్న విద్యాదీవెన రద్దు చేయడం దుర్మార్గమ న్నారు. పుస్తకాల కొనుగోళ్లల్లో వైసీపీ నాయకులు రూ.వంద కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. విదేశీ విద్య నిధి పథకాన్ని రద్దు చేయడం వల్ల ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఇంటర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రద్దు, నిరుద్యోగ భృతి రద్దుతో విద్యార్థులకు నష్టం జరిగిందన్నారు. బాలికలకు సైకిళ్ల పంపిణీ రద్దు, బెస్ట్‌ అవెలబుల్‌ స్కూల్స్‌ రద్దుతో ప్రభుత్వం అంతా రద్దుల మయం అయిపోయిం దన్నారు. కొవిడ్‌ సమయంలో 600 మంది ఉపాధ్యాయులు చనిపోతే ప్రభు త్వం పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో అధికార ప్రతినిధి కె.మణికంఠ, ఎస్‌.సతీష్‌, గణేష్‌, ప్రకాష్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-31T05:18:42+05:30 IST