టీడీఎస్‌ బాదుడు!

ABN , First Publish Date - 2022-08-12T05:39:17+05:30 IST

రిజిస్ర్టేషన్‌ శాఖకు టీడీఎస్‌ చెల్లించక తప్పదు.

టీడీఎస్‌ బాదుడు!

రిజిస్ర్టేషన్‌శాఖ అదనంగా ఒక శాతం వసూలు
రూ.50 లక్షల పరిమితి దాటిన ఆస్తులకు వర్తింపు

(భీమవరం–ఆంధ్రజ్యోతి)
రిజిస్ర్టేషన్‌ శాఖకు టీడీఎస్‌ చెల్లించక తప్పదు. ఆదాయ పన్నుల శాఖ విధులను సైతం రిజిస్ర్టేషన్‌ సిబ్బందికి అప్పగించారు. ఖరీదైన ఆస్తులు కొనుగోలు చేసేవారు ఒక శాతం టీడీఎస్‌ చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల క్రితమే ఈ విధానం అమలు లోకి వచ్చింది.  కొనుగోలు చేసిన ఆస్తి విలువ రూ.50 లక్షలు పరిమితి దాటితే ఒక శాతం టీడీఎస్‌ చెల్లించాలి. అంటే ఉదాహరణకు ఎవరైనా రూ.50 లక్షలు విలువైన భవనం లేదా స్థలం కొనుగోలు చేస్తే స్టాంప్‌ డ్యూటీతో పాటు అదనంగా ఒక శాతం టీడీఎస్‌ చెల్లించాలి. అంటే రూ.50 వేలు ప్రభుత్వానికి చెల్లించాలి. అయితే టీడీఎస్‌ భారం కొనుగోలుదారుడిపై భారం పడదు. అమ్మకం దారుడే ఆ మొత్తాన్ని భరించాల్సి ఉం టుంది. దస్తావేజులోనే ఆ విషయాన్ని పొందుపరచాలి. స్థలం కొనుగోలు దారుడు రూ.50 లక్షల విలువైన ఆస్తి కొనుగోలు చేస్తే దస్తావేజులో అమ్మకం దారునకు రూ.49.50 లక్షలు అమ్మకం దారుడికి చెల్లించినట్లు, మరో రూ.50 వేలు టీడీఎస్‌ రూపంలో ప్రభుత్వానికి జమ చేసినట్టు వివరించాల్సి ఉంటుంది. చెల్లించిన టీడీఎస్‌ మొత్తానికి అమ్మకం దారుడు రూ.50 లక్షల ఆస్తికి ఆదా యపు రిటన్స్‌ సమర్పిస్తే ప్రభుత్వం అతని ఖాతాలో తిరిగి జమ చేస్తుంది. ఒక వేళ రిటన్స్‌ దాఖలు చేయని పక్షంలో ప్రభుత్వ ఖాతాలోనే ఆ మొత్తం ఉండి పోతుంది.

 కొనుగోలుదారుడిపై భారం
ప్రభుత్వం తాజాగా అమలు చేస్తున్న టీడీఎస్‌ విధానం వల్ల అంతిమంగా కొనుగోలు దారుడిపై భారం పడే అవకాశం కనిపిస్తుంది. కొనుగోలుదారుడు రిజిస్ర్టేషన్‌ విలువను తగ్గించి టీడీఎస్‌ మొత్తాన్ని ప్రభుత్వానికి జమ చేస్తారు. అధికారికంగా ఇది అమలు జరుగుతుంది. కానీ అనధికారింగా కొనుగోలు దారునుంచే మొత్తం సొమ్మును రాబట్టనున్నారు. అమ్మకం దారుడు ఆదాయం రిటన్స్‌ దాఖలు చేయని పక్షంలో కొనుగోలు దారుడిపైనే టీడీఎస్‌ భారాన్ని మోపనున్నారు. దీనివల్ల రిజిస్ర్టేషన్‌ విలువపై అదనంగా ఒక శాతం టీడీఎస్‌ ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది. ఇప్పటికే 7.5 శాతం స్టాంప్‌ డ్యూటీ అమ లులో  ఉంది. ఆస్తి విలువ రూ.50 లక్షల పరిమితి దాటితే ఒక శాతం టీడీఎస్‌ రూపంలో కొనుగోలు దారుడిపై భారం పడనుంది. 

Updated Date - 2022-08-12T05:39:17+05:30 IST