ప్రచార కరపత్రాలను ఆవిష్కరిస్తున్న బడేటి చంటి
టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి
ఏలూరు టూటౌన్, డిసెంబరు 1 : రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, ప్రజా వ్యతిరేక పాలనను వివరించేందుకు గడపగడపకు టీడీపీ కార్యక్రమం నిర్వహి స్తున్నట్టు టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు. బడేటి క్యాంపు కార్యాలయంలో బుధవారం ఈ మేరకు కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పాలనలో అవి నీతి, అక్రమాలు పెచ్చుమీరిపోయాయన్నారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగు తోందన్నారు. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు, ప్రభుత్వ వైఫల్యాలను వివరిం చేందుకు పక్షం రోజుల పాటు గడపగడపకు టీడీపీ కార్యక్రమాన్ని నిర్వహిస్తా మన్నారు. 1983వ సంవత్సరంలో దివంగత ఎన్టీఆర్ పేదలకు ఇళ్లు ఇచ్చారని, అనంతరం చంద్రబాబు నాయుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారన్నారు. ఇప్పు డు వాటికి రూ.10 నుంచి రూ.20 వేలు జగన్ ప్రభుత్వం వసూలు చేస్తూ వేలా ది కోట్ల రూపాయలను దోపిడీ చేసేందుకు పన్నాగాలు పన్నుతున్నారన్నారు. ఒకపక్క ఆస్తి పన్ను, చెత్తపన్ను పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవన విధానాన్ని వైసీపీ ప్రభుత్వం అతలాకుతలం చేసిం దన్నారు. కార్యక్రమంలో టీడీపీ కార్యాలయ కార్యదర్శి పాలి ప్రసాద్, చోడే వెంక టరత్నం, కప్పా ఉమామహేశ్వరరావు, నెరుసు గంగరాజు, గూడవల్లి వాసు, మారం హనుమంతరావు, అమరావతి అశోక్, రెడ్డి నాగరాజు, త్రిపర్ణ రాజేష్, లంకపల్లి మాణిక్యాలరావు, గురజాపు గోపి, పెద్దాడ వెంకటరమణ, ఆరేపల్లి తిరుపతి, మాకాల రమేష్ పాల్గొన్నారు.