వైసీపీ రైతు దగా ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-06-20T04:27:24+05:30 IST

శనివారం టీడీపీ అను బంధ తెలుగు రైతు సంఘం ఆధ్వర్యంలో ధాన్యం బకాయిలు చెల్లించాలని తదితర రైతుల సమస్యలపై కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు.

వైసీపీ రైతు దగా ప్రభుత్వం
కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తున్న టీడీపీ నేతలు

టీడీపీ నాయకుల వినూత్న నిరసన

ఏలూరు కలెక్టరేట్‌, జూన్‌ 19 : వైసీపీ ప్రభుత్వం రైతుల్ని దగా చేసిందని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. శనివారం టీడీపీ అను బంధ తెలుగు రైతు సంఘం ఆధ్వర్యంలో ధాన్యం బకాయిలు చెల్లించాలని తదితర రైతుల సమస్యలపై కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రామా నాయుడు మాట్లాడుతూ కొవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.  ధాన్యం బకాయిలు రైతులకు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ మాట్లాడుతూ ధాన్యం బకాయిలు వెంటనే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి చంటి తదితరులు మాట్లాడారు. 

 వినూత్న నిరసన 

తెలుగు రైతు విభాగం నాయకులు వినూత్న నిరసన ప్రదర్శించారు. రైతులకు  అప్పులు ఇచ్చిన వడ్డీ వ్యాపారస్తులు, బ్యాంకు అధికారి వేషాల్లో ఉన్న వారు అప్పు తీసుకుని చెల్లించలేదని రైతులను నిర్బంధించినట్టు వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. రైతు వేషంలో నర్సాపురం పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షుడు రాచూరి రాం ప్రసాద్‌ చౌదరి ప్లకార్డులను పట్టుకున్నారు. 




Updated Date - 2021-06-20T04:27:24+05:30 IST